మతం-ప్రేమ-మానవత్వం

మతం-ప్రేమ-మానవత్వం

రచయిత :: బొడ్డు హారిక

మా ఊరు అనంతపురం, మా ఊరు లో ప్రత్యేకత చూడగానే ఆనందం కలిగేది ఏమిటంటే శివకేశవుల మందిరం ప్రక్కనే మసీదు ఉంటుంది. శివకేశవుల మందిరం ప్రక్కన ఉన్న ప్రాంతంలో అందరూ బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు, అందుకే ఆ ప్రాంతాన్ని బ్రాహ్మణ పేట అంటారు.

వీరికి ఎంతో పట్టింపులతో కూడిన ఆచారాలు.మసీదు ఉండే ప్రాంతంలో అన్ని మతాల వారు కలిసి ఉంటారు. బ్రాహ్మణుల పేటలోని వారు మసీదు వైపు వారిని చూసిన మతబ్రష్టులవుతున్నారు అంటూ ఉంటారు.

ఇన్ని గొడవలు మధ్యలో గాయత్రి ముస్లిం అయిన రహిం నుంచి ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి వాళ్ళ నాన్న గారు శాస్త్రి గారు గాయత్రి ని నువ్వు మైలపడిపోయావు, అగ్ని తో పూనితురాలువవు అని అందరూ చూస్తుండగానే రహిం అడ్డు పడుతున్నా సరే గుడి బయట గాయత్రి కి నిప్పు పెట్టారు.

రహిం ప్రాణం గా ప్రేమించిన గాయత్రి మంటల్లో కాలిపోతుంటే శాస్త్రి గారు తో రహిం మా ఇద్దరికీ మనువు కి మతం అడ్డుగోడయింది, కానీ మరణం లో మమ్మల్ని వేరుచేయలేరంటూ గాయత్రిని పట్టుకొని తను కూడా కాలిపోయాడు. రహిం కాలిపోవాడం చూసిన వారి బంధువులు రహిం తల్లిదండ్రులకు చెప్పారు, వారు పరుగుపరుగున వచ్చేసరికే రహిం గాయత్రి బుడిదై పోయారు.

అది చూసిన రహిం తల్లిదండ్రులు కళ్ళు తిరిగి పడిపోయారు.అందరూ లేపగ లేచి భోరున ఏర్చారు. శాస్త్రీ గారు నుంచి మీ అమ్మాయి ని మీరు వదిలేసిన వారిద్దరూ మా ఇంట్లో సంతోషంగా ఉండే వారు కదా, ఇద్దరిని చంపేశారు అంటూ ఏడుస్తూ రహిం , గాయత్రిల బుడిద తీసుకుని ఇప్పుడైన మా ఇంట్లో నే ఉంటారు అని వెళ్ళిపోయారు.

ప్రస్తుతం మా ఊరు లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా అవడం తో ఎవ్వరూ బయటకు రావడం లేదు, ఉదయం 6 నుంచి 10వరకు నిత్యావసరాలకు మాత్రమే బయటకు వస్తున్నారు. దేవాలయాలు మూసివేశారు, మసీదులు ప్రస్తుతం ఉపవాసాలు కావున తక్కువ మంది జనంతో నమాజు చేస్తున్నారు.

అదే సమయంలో శాస్త్రి గారికి కరోనా రావడంతో ఇంట్లో నే జాగ్రత్తలు పాటిస్తూ మందులు వేసుకుంటూ ఉంటున్నారు.కాని రెండు రోజుల క్రితం ఒక్కసారి గా శ్వాస అందుకోలేక మరణించారు. కరోనా కారణంగా ఎవ్వరూ అయినను చూడడానికి కూడా రాలేదు. ఆఖరికి కొమ్ము కాయడానికి కూడా రామన్నారు.

అదే సమయంలో ఉపవాసం ముగించుకుని నమాజు చేసుకుని ఇంటికి వెలుగుతున్న ముస్లింలు చూసి మేము మోస్తాము అన్నారు. అక్కడ ఇంక ఎవరూ లేకపోవడంతో శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి వారికి అలాగే నండి చాలా ధన్యవాదాలు అన్నారు.

శాస్త్రి గారు ఏ మతం వారితో మనువు వద్దని తమ ఇంటి మహాలక్ష్మి ని మంటల్లో కాల్చేసారో చివరికి అదే మతం వారితో మోయించుకుంటూ చివరి ప్రయాణం చేసారు.

అందుకే మానవత్వానికి , ప్రేమ కు ఎటువంటి మతం అడ్డుకాదని ప్రతి మనిషి గుర్తించాలి.

***

You May Also Like

2 thoughts on “మతం-ప్రేమ-మానవత్వం

  1. మానవతా విలువలు ప్రబోధించే కథనం…. అద్భుతం.
    హారిక గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!