మదిలో మెదిలే భావాలు
రచన: శిరీష వూటూరి
ఇంద్రధనస్సు వర్ణాలు
మదిని దోచిన సుందర
దృశ్యాలు
మబ్బుల్లో చక్కని చిత్ర
లేఖనం గీసినట్టుగా
అన్ని వర్ణాలతో హోళీ
ఆడినట్టుగా
రంగు రంగుల చీరతో
మేఘాలను అలంకరించినట్లుగా
జీవితపు ఒక్కొక్క మలుపు
ఒక్కొక్క రంగును సూచించగా
మదిలో మెదిలే ఎన్నో
భావాలకు అద్దం పట్టినట్లుగా
తలుకులీను ఇంద్రధనస్సు
దోచేను అందరి మనస్సు……