సిరివెన్నెల సీతారామ శాస్త్రి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జె వి కుమార్ చేపూరి
తెలుగు పాటల పూదోటలో పూసిన వెన్నెల
తన తేనియ మాటలు వెలిగె నాలుగు దిక్కుల
తెలుగు పాటను తాజార్చే దిగంతాల కవతల
ఆ సుకవి, సత్కవి కాక మరెవ్వరు సిరివెన్నెల
సిరిని నేలకు వదిలి దివికేగిన సాహిత్యం
వెన్నెల నేలన పరిచి గగనానికేగిన కవనం
తెచ్చె తెలుగు పాటకు కావ్య వైభవం
పాటన్న తెలుగు కన్యకు చేసె అలంకారం
తొడిగె పదాల పరికిణీల కంచిపట్టు వస్త్రం
దిద్దె నుదుట భావమన్న కుంకుమ తిలకం
తెలుగుపాట వేలు పట్టి నడిపించిన పాదం
పాట వేలు విడిచి అయ్యే హఠత్తుగా మాయం
సిరి వెన్నెల అమావాస్యలో ఐక్యం
కావ్యవైభవ కలం ఆగిపోయె సత్యం
ఆ పాటకు లేదు ప్రత్యామ్న్యాయం
ఆ కలానికి లేదు సాటి మరే కలం
సిరివెన్నెల పాటకు లేదు మరణం
జన హృదుల్లో అది అజరామరం