సమస్య పై పోరాటం

సమస్య పై పోరాటం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

మనిషిని చూడు వైకల్యాన్ని కాదు
మనసును చూడు అవయవ లోపం కాదు
మనసు పెట్టి చేయాలనుకుంటే
వైకల్యం అడ్డు రాదు
ఆత్మసైర్యమే వారి పెట్టుబడి
నీ అవిటితనం చూసి భయం వద్దు
బలహీనులమని దిగులు వద్దు
మనసు లేని వాళ్ళే
నిజమైన మానసిక వికలాంగులు
అవయవ లోపం శాపం కాదు
విజయాలకు వైకల్యం అడ్డు కాదు
సంకల్పం ఉంటే
దేవుడు కూడా కరుణిస్తాడు.
కర్తవ్య దీక్ష ఉంటే
అపజయం నీ దరికి రాదు
అంగ వైకల్యం ఉన్నా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు
చేయూత, ప్రేమ పంచటం మన బాధ్యత
ఆశయ సాధనకై పాటు పడు
సమస్యని చూసి భయ పడకు
శరీర లోపం వారి తప్పు కాదు
ఎదుటి వారి కి సాయం చేయక పోవటమే
నిజమైన వైకల్యం
మానసిక దౌర్బల్యం

You May Also Like

12 thoughts on “సమస్య పై పోరాటం

  1. చాలా బాగా చెప్పారు పోరాటం గురించి విద్య గారు.
    నిజమైన వైఖల్యం మనుషులను గౌరవించచక పోవటమే.
    అది తెలుసుకోవాలి అందరూ

  2. నా కవిత సమస్య పై పోరాటం చదివిన కార్తీక్ గారికి, పద్మావతి గారికి, సుగుణ గారికి, కవిత గారికి, చిన్ని కి, పద్మకి, D S Sv గారికి , శ్రీ శ్రీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తో నమ: శుమాంజలి🙏🙏🙏

  3. చాలా బాగుంది విద్య గారు
    బాగా చెప్పారు
    బతుకు పోరాటం
    ఇంకా ముందు ముందు ఇంకా చాలా కవితలు రాయాలని కోరుకుంటూ
    హృదయ పూర్వక అభినందనలు
    మీ స్నేహితురాలు
    కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!