క్షేత్రపాలకుడు

క్షేత్రపాలకుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:ఆకుమళ్ల కృష్ణదాస్

అన్నీ.. నాకు మా మామనే
నాకే కాదు అందరికీ మామనే
మామంటే ఎవరనుకున్నారు మీరు!
గగనాన నిగ నిగలాడే అందాల చందమామ!
నా మనసుకు ఆహ్లాదపు ఆకలేస్తే
మధుర మనోహర పండువెన్నెలను
తనివితీరా గ్రోలుతుంటా!
అలసిన మనసు విశ్రమించాలంటే
జాబిలి ఊయలలో ఊగుతుంటా!
కలువలైతే భలే కబుర్లు చెబుతాయి
నిగనిగ లాడే నెలరేడు గూర్చి!
మాటలన్నీ మరుమాలగా మార్చి..
తమను తాము తమకంలో మైమరచి!
ఆనందంలో ఎన్నిసార్లు ఆరగించానో
మల్లెపూవంటి వెన్నెల అన్నాన్ని!
కమ్మని వెన్నలా జుర్రుకుంటూ!
అలసటతో ఆరుబయట విశ్రమించినా
మావయ్యే నాకు రక్ష!క్షేత్రపాలకుడై!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!