అపార్థం

అపార్థం

రచన: శ్రీదేవి విన్నకోట

ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించనీ మనిషి,
కన్నీళ్లు తాకని చెక్కిళ్ళు
అపార్ధాలు రాని  మనుషులు
ఈ లోకంలో ఉండనే ఉండరు. అపార్థాలు తొలగి
మళ్లీ మనసులు ముడిపడితే
ఆ మనసులకు జీవితాంతం
ఆనంద అనురాగ సంగమమే,
అందుకే ఎవరైనా అపార్ధాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని అపార్ధాలు సృష్టించే విషయాలు అతి మెలకువగా దూరం చేసుకుని,
తెలివిగా ఎదుటి మనిషిని మెప్పించి ఒప్పించి,
అపార్ధాలు మీ చెంతకు రాకుండా జాగ్రత్త వహించండి.
అపార్థం ప్రతి ఒక్కరి  జీవితంలో ఉప్పెనలా
ఎప్పటికైనా అనర్థమే.
ఇది మాత్రం  గుర్తించండి
అపార్థం సృష్టించే
అనర్థం అనంతం.
ఇదే ప్రతి జీవితం చెప్పే అనుభవ సారాంశం.

You May Also Like

One thought on “అపార్థం

  1. అపార్థం గురించి చాలా బాగా చెప్పారు శ్రీదేవి గారు👌👌👌😍🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!