ప్రకృతి

ప్రకృతి

రచన: సావిత్రి కోవూరు

ప్రకృతి అంతా పాడు చేసి, కొండలన్ని పిండి చేసి, రాళ్ళు రప్పలు, మట్టి దిబ్బల మయము చేసి పర్యావరణ సమతుల్యత కాన రాకుండా చేసి
హరితమన్నది అదృశ్యం చేసి,భూతాపమెంతో పెంచి ఓజోన్ పొర అంతయు చిల్లి పడగా, వర్షపాతము లేకపోగ, పాడి పంటలు అంతరించి ప్రళయమే తాండవించగ, కాలుష్య కోరల్లో చిక్కి అల్లల్లాడే ప్రకృతి.

పచ్చని పంటలు ఉన్నా భూములన్ని ఆక్రమించి కాంక్రీట్ జంగిల్ గా మార్చి, కారుచిచ్చులు రేపితే,
కర్మాగారము లెన్ని నిర్మించినా, కాలుష్యం  విర జిమ్మ కుండ తగు జాగ్రత్తలు తీసుకుంటే,
కాలుష్యం హేతువైన రసాయనాలు గాలిలోనూ, నీటిలోనూ, భూమిలోను కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి మాత ఆరోగ్యమే కాదు,
ప్రకృతిలోని జీవజాలం అంతా ఆరోగ్యంతో విలసిల్లుగ

వనములన్ని కాపాడితే వర్షపాతము పెరిగిపోయి, పాడిపంటలతో భూమి సస్యశ్యామలంబౌను కదా ప్రకృతే ప్రసన్నమౌను
చెట్టు ఒకటీ నరికితే పది చెట్లు నాటే శిక్షనమలుపరిస్తే హరిత వర్ణపు కోక కట్టి హర్షించదా భూమాత

వర్షపు నీరు అంతా బొట్టు బొట్టు ఆదా చేసి చెరువులన్ని నింపి వేస్తే,
ఆకుపచ్చని చీర కట్టి భూమాత సంతసించగ కృషీవలుని కడగండ్లు అన్ని కదలి పోవా, కనులకు కనిపించకుండా
రైతే సంతసించగ రాజ్యమే వికసించు గదా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!