మన వికృత చేష్టలు

మన వికృత చేష్టలు

రచయిత :: మురళీ జాదవ్

ఆక్రోదన ఆందోళన
ఆవేదనకు
కారణం ఎవరు ?
ఎవరు కారణం..?
కలికాలమా? కనిపించని జాలమా?

కారుచున్నాయి కన్నీళ్లు,
కాలుచున్నాయి శవాలు
అంటరాని మనుషులు
కన్నీళ్లు తుడవరాని చేతులు
ఖరీదు కట్టే చితిలు

నిశ్శబ్దాగ్ని నింగికేగిసి…
నిలువెత్తు దహింస్తూంటే
ఊపిరాడక ఊపిరిడిచిన
ఊరపిచ్చుకల వోలె…
ఊరు వాడల మనుషుల
శవాలుగా సవాలక్ష సవాలై ప్రశ్నించే..?

ప్రకృతియె పరితపిస్తే
వైపరీత్యాలు కళ్ళు తెరవదా?
ఉన్న కొమ్ములు నర్కుంటే…
ఆక్సిజన్ ఆశ ఇంకెక్కడా?
అవని నిండ కాలుష్యకోర
నోరు జాపుతే..
కరోన వంటి కరడు రోగం కత్తి దువ్వదా..?

అభివృద్ధికి అడ్డు అంటూ
వనాలను కూలదోస్తవి
స్వచ్చజీవితం సంకెళ్లైతే
విపత్తు అంటూ చిందులేస్తివి
ఈ నాడు ప్రపంచం విశాల
నుండి విశాధమైయె
ఆప్తుల కోసం చేతులు చాచి ఆశ చూసే
క్షణలో సంఖ్యలు పెరిగి శవాలతో కుప్ప మిగిలే..

నెల నిప్పు నీరు గాలి
వెలుగు చీకటి తినే తిండి…
మనకోసం ప్రకృతి మాత
సృష్టించిన భిక్షకాదా!
వెర్రి దేవుడంటూ
పేరు బెట్టి నిందిస్తూంటావు
దేవుడే సిగ్గుపడే ఘనకార్యాలు చేస్తావు

సృష్టి దేవత సృష్టించిన ప్రకృతి అందం
మానవాళికి షడ్రుచుల ప్రసాదం
గాలి నీరు నిప్పు నెల ఆకాశం
కోటానుకోట్ల ప్రాణులమైన మన కోసం!!!

మండుటెండకు అడవి తల్లి
ఆకురాల్చి నగ్నమైతే..
బాధ బాద్యత లేని మనిషి
అగ్గి బెట్టి బుగ్గి చేసె..
చిన్న పెద్ద జీవజంతు
నిప్పు ధాటికి శున్యమైతే..
గోడు గోడున ప్రకృతి వికృతంగా విలపించె!!

కంపెనీలుకార్ఖానాలు
ఘాటు పొగలు చిమ్ముడాయె
మిద్దెమీద మిద్దెకట్టి
పొద్దుతాకే భవంతులాయె
ప్లాస్టికు భూతమే
భూమి నిండ నిండిపోయె
ఒంటికైన రెంటి కైనా వాహనంపైనే నడ్చుడాయె!!

ఈ వికృతకేళి హోళీఆటకు
కారణం ఎవరు?
ఎవరు? కారణం??
కాదు మనమా! లేదా? కలికాలమా..??
కనిపించని జాలమా…???

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!