విజయం బాటలో

విజయం బాటలో

రచయిత :: శ్రీదేవి విన్నకోట

నా జీవితం అనే అట మొదలైంది.
నేను పుట్టినప్పుడే ప్రతి చోట ప్రతి విషయంలో
అడుగడుగునా నాకు వినిపించే జీవిత పాఠాలే
ఏనాడైనా గడపదాటితే  నా చెవులు వినలేనన్ని జాగ్రత్తలే.గట్టిగా మాట్లాడితే అక్కర్లేనన్ని అంక్షలే
మనసు విప్పి నవ్వితే ఉరుమురిమి చూసే కళ్ళే
ఇంట్లో మగ పిల్లలతో సమానంగా
అన్ని విజయాల్లో పోటీ పడితే
నువ్వు ఏమన్నా మగరాయుడివా
అనే వేటకారపు ముసిముసినవ్వులే
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా చిన్నప్పట్నుంచి
నేర్పే  వినయం విధేయత అనే పదాలు గుర్తొచ్చి
పెద్ద వాళ్ళకి ఎదురు చెప్పలేని పిరికితనమే
అయినా ఏదో సాధించాలనే తపన
అందరూ నన్ను చూసి గర్వపడాలి అనే ఆశ
ఏది ఏమైనా అడుగడుగునా ప్రతి చోటా గెలవాలనే ఆలోచన అందుకే ఊరి వాళ్ళ మాటలకు నీళ్లొదిలి
ఎవరేమనుకున్నా  అలుపు లేకుండా
విజయం వైపు నా పయనం కొనసాగిస్తున్నా
గెలుపు దారిలో ముందుకు దూసుకుపోతున్నా.

You May Also Like

One thought on “విజయం బాటలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!