శిబి చక్రవర్తులారా జర భద్రం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

శిబి చక్రవర్తులారా జర భద్రం

రచయిత :: వడ్డాది రవికాంత్ శర్మ

ఎడారిలో ఒయాసిస్సుని చూసి ……
ఎడతెగని ఒత్తిడి ఉద్యోగంలో క్షణం తీరికలేని నేను …
ఎదురుగ కనిపించిన సేవాసంస్థని చూసాను ….
ఎందుకో తెలీదు …. మానవత్వం ఎగసిపడింది నాలో
ఎన్నాళ్ళో దాచుకున్న దానం ….. అంతర్జాలంలో మొదలైన నా దాతృత్వం ….

నకిలీ సేవాసంస్థలపై కేంద్రం విదిల్చిన జులుం …
వేలకొద్దీ నయా మోసగాళ్ల జాతకాలు నెట్టింట్లో ఇక పదిలం ….
జాతి భద్రతకు పెనుసవాలు విసురుతున్న వైనం ….
రాజకీయ కుంపట్లు రాజేసి ….
యువత మెదళ్లలో విషపు బీజాలు నాటి …
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేసే …..
ఆధునిక అంతర్జాల కుట్రలు ఇక నిర్వీర్యం ….

సేవా శిబి చక్రవర్తులారా జర భద్రం …
తెలిసిన వారికే ఇవ్వండి మీ విలువైన దానం…
అపాత్రదానం అనారోగ్యకరం ….
నయా మోసగాళ్ల దేశద్రోహానికి ఉపయోగకరం …..
మానవత్వపు ముసుగు మోసాలకు కారాదు మనం బలిపశువులం …

You May Also Like

3 thoughts on “శిబి చక్రవర్తులారా జర భద్రం

  1. “వేలకొద్ది నయ మోసగాళ్ల జాతకాలు ఇక నెట్టింట్లో పదిలం”
    ఇది అయితే వాస్తవం.. 👆👆👆..

    శిబి చక్రవర్తులారా జర భద్రం అంటూ చక్కగా వివరించారు అండి.. 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!