మానవత్వపు మరోకోణం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మానవత్వపు మరోకోణం

రచయిత :: అలేఖ్య రవికాంతి

మానవత్వం మంచితనం
మనిషిలోని మంచి సుగుణం
సాయం కోసం ఎదురు జూసే
కన్నీటి కష్టాలకి ఆపన్నహస్తం

మరి నేటి కలియుగపు సమాజంలో పరిమళిస్తుందా మానవతా సుగుణాల పుష్పం!!?

పేదవాని ఆకలికి అన్నం పెట్టిన
మానవత్వానికి స్వీయ చిత్రాలు ఎందుకు చిత్రంగా

ఆపదలో ఆదుకున్నందుకు
కావాలా బిరుదులు ఏకంగా

స్వచ్ఛంద సంస్థల పేరిట
లక్షల్లో దొరికే రాబడి
బీదోడి బొజ్జలోకి పావు
మందం జేర్చే దోపిడి

నేటి మానవత్వం పైకి
మేడుపండోలే నిగనిగలాడుతూ
ఆకలి తీర్చే అక్షయపాత్రలా కనిపిస్తుంది
లోనేమో తమ స్వలాభపు దాకలా లోకం ముందు పోకడలా కుళ్ళు నింపుకుంది

నేటి స్వార్థపు సంసారంలో
అక్కడక్కడా ఇంకా బతికే ఉంది గంజాయి వనంలో తులసి మొక్కలా
నిస్వార్ధపు మానవత్వం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!