వెంకటేశం నా చిలిపి నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               వెంకటేశం నా చిలిపి నేస్తం

రచన ::జె వి కుమార్ చేపూరి

నా సహోద్యోగి వెంకటేశం
నాకున్న నా చిలిపి నేస్తం
నా సహోద్యోగులు మరో
ఇద్దరు వివాహితులు
మా అందరి నివాసం
పరిశ్రమ గృహ సముదాయం
నేను, నా చిలిపినేస్తాం
ఇద్దరిదీ బ్రహ్మచర్యం
మా సహోద్యోగుల మధ్య
సదా పోటీ వాతావరణం
ఏపనైనా ఒకరికంటే ముందు
మరొకరు చేయాలని ఆత్రం
త్వరలో చేతక్ స్కూటర్ కొంటున్నామని
సహోద్యోగి అన్నది మరో సహోద్యోగితో
ఆమె కంటే ముందు తాను కొనాలని
నిర్ణయించింది వెంటనే రెండోఆమె
మరునాడు సాయంత్రం ఆమె ఇంటి
ముందున్నది ఒక వాడిన చేతక్
ఆమె భర్త గర్వంగా అందరినీ పిలిచి
తనుకొన్న దాన్ని పెట్టాడు ప్రదర్శనకు
దాని తాను పదివేలకు కొన్నానని
అందరినీ అడగసాగాడు ఎలావుందని
చూసిన అందరూ మెచ్చుకున్నారు బాగుందని
ఇక వచ్చింది మా వెంకటేశం వంతు
నడిపి చూడొచ్చా ఒకసారని అడిగి
ఒక రౌండు వేసుకొచ్చాడు నిట్టూర్చి
ఎలా ఉందని అడిగాడు కొన్నాయన
అయిదు పైసలు ఖరీదు చేసేదే కావచ్చు
దాన్ని మీరిష్టపడి రూపాయకు కొన్నారు
దానికి మీరు బాధ పడవలసిన
పనిలేదన్నాడు మా వెంకటేశం
అని అక్కడున్న అందరిని నవ్వుల్లో
ముంచెత్తాడు నా చిలిపి నేస్తం
అయోమయంలో పడేసాడు అది
కొన్నవాడిని నా చిలిపి నేస్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!