(అంశం : నా అల్లరి నేస్తం) ప్రియమైన శత్రువు
రచన ::వాడపర్తి వెంకటరమణ
బొజ్జనిండా భోజనం పెడుతుంటాను
అయినా ఎందుకో అప్పుడప్పుడు
అలిగిన ఇంటి ఇల్లాలిలా
మూతి ముడుచుకుంటుంది
నా చేతులతో ఆప్యాయంగా
డాబాపైకి తీసుకుపోతానా
అటూ ఇటూ తిరుగుతుందేగానీ
దయలేని ప్రేయసిలా దరికిరాక
మారాం చేస్తునేవుంటుంది
తనకుగానీ కోపంవస్తే
తన జాడ తెలియనీయక
రాళ్ళూ రప్పలూ గుట్టలూ మెట్టలూ
పరి పరి ప్రదేశాలుతిప్పి
ఆనందంగా గెంతులేస్తుంది
ఇన్ని రకాలుగా హింసలు పెడుతున్నా
నా ప్రియమైన శత్రువు అదే మరి
అంతర్జాలానికి మించిన
అల్లరి నేస్తం ఎవరుంటారు చెప్పండి!
Super