ఆత్మీయ నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               ఆత్మీయ నేస్తం 

రచన ::క్రాంతి కుమార్ (ఇత్నార్క్)

నగరం నిద్రపోతున్న వేళ
నిశి రాత్రిలో నన్ను మేల్కొలిపి
కలల ప్రపంచ విహారానికి
రమ్మని ఆహ్వానం పలికి
బాధల తీరాన్ని దాటించి
సంతోష సాగరంలో ఓలలాడించి
బ్రతుకు ప్రయాణంలో జాగ్రత్తలు చెప్పి
జీవిత విలువల నిధి అన్వేషణలో
పోరాట స్ఫూర్తి అక్షరాలను దిద్దించి
స్వేచ్ఛా సమరంలో యోధుడిగా తీర్చిదిద్ది
విజయ శిఖరాలకు చేర్చిన
ఆత్మీయ అల్లరి నేస్తం నా అంతరాత్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!