నాస్తికుడు

నాస్తికుడు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

దేవుడు లేడు, నేను పూజ చెయ్యను, నేను నాస్తికుడిని అనే వాళ్లు అంతా చదవాల్సిన కథ.
ఆకాశం ఏ ఆధారంతో పైన అతకబడింది?
సూర్య చంద్రులు వారి కదలికా క్రమంలో ఒకరిని ఒకరు ఎప్పుడూ  తాకరా?
మనం మేడ పైన పడుకున్నప్పుడు, ఒక నక్షత్రం వచ్చి మీద పడితే?
అంత చిన్న పక్షులు ఆకాశంలో అంత పైకి ఎగురుతున్నా వాటికి ఏమి అవదా? ఇవన్ని ఒక నాస్తికుడి గా ఆలోచించు.
ఇంక దేవుడి మీద భక్తితో మాట్లాడుకుందాము.
ఆహా, ఏమి ఆ జలపాతం ఎంత అందంగా ఉందో!
అమ్మో, ఆ కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో!
అంత చిన్న చీమకు, ఆకలి. ఆ బుజ్జి పొట్టకోసం మళ్లీ కొంత ఆహారం దాచుకోవటం, దానికి ఎవరు నేర్పారు ఇవి అన్నీ?
సాయి షణ్ముఖి ఒక  సైంటిస్టు. దేవుడు కాదు, దేవుడు లేడు. లోకం మొత్తం సైన్స్ అంటుంది.
వాళ్ల తల్లిదండ్రులు మాత్రం మంచి దైవ భక్తి కలవారు. షణ్ముఖి వృత్తి పరంగా మంచి పేరు తెచ్చుకొంది. ఇంకా పెళ్లి చెయ్యాలి అని. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.అబ్బాయి పేరు శ్రీకర్. పెద్ద డాక్టర్ ,మంచివాడు. అమ్మా వాళ్లని వదలి వెళ్లాలి అంటే భాదగా ఉన్నా, ఒకే సిటీ లో ఇళ్లే కాబట్టి కొంచెం పరవాలేదు అనిపించింది.తరవాత సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు. అత్తమామలు తల్లిదండ్రులతో కలసి తిరుపతి బయలుదేరింది. బాబుకి నామకరణం, పుట్టు వెంట్రుకలు తిరుపతి లో జరగాలి అని శ్రీకర్ కోరిక. మర్నాడు ఉదయాన్నే తిరుపతిలో ట్రైన్ దిగారు. అక్కడ రూమ్ తీసుకోవడానికే, ఒక గంట పట్టింది.ప్రతీ సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఇలాగే ఇబ్బంది పడతారా అమ్మా అంది. శ్రీహరి ని నమ్మి చూడు, అది ఏం ఇబ్బంది అనిపించదు. అంది వాళ్ల అమ్మ.కానీ తనకు తెలియకుండానే, మానసికంగా ప్రశాంతత లభించింది షణ్ముఖి కి.అదే చెప్పింది వాళ్ల అమ్మతో. ఆవిడ నవ్వి ఊరుకున్నారు.మద్యాహ్నము దర్శనానికి వెళ్లి, ఆ జనాన్ని చూసి ఆశ్చర్యంలో  మునిగిపోయింది.ఇంకా ఆ మూల విరాట్ విగ్రహం అయితే, దృష్టి మరలించు కోవటం చాలా కష్టమయింది.అదీ లైట్లు ఏమి ఉండవు, ఒక క్యాండీల్ మాత్రమే ఉంటుంది లోపల అన్న నాన్న వివరణ కి నమ్మలేనట్లు చూసింది ఆయన వైపు.
ఏ నాటి విగ్రహం అది అని ఆలోచిస్తుంటే, అమ్మ నమస్కారం చేస్కొమని పిలిచింది.ఎదురుగా పెద్ద హుండి. అది కూడా గుడ్డ తో చేసింది. డబ్బులతో  నిండిపోయి ఉంది. ఒకావిడ వాళ్ళ అమ్మాయి చెవులకి, చేతులకు, మెడలో ఉన్న బంగారం అంతా హుండీలో వేసేసింది.నేను అలాగే చూస్తుంటే, పాపం ఏం గండం వచ్చిందో ఆ పాపకి అంత మొక్కు మొక్కింది అన్నారు మా అత్త గారు.నిలువు దోపిడీ అంటారట. ఆ మొక్కుని. మొత్తం సంపాదించిన డబ్బు అలా ఎ నమ్మకం లేకుండా ఎందుకు సమర్పిస్తారు.దేవుడి మీద ఒక అపారమైన నమ్మకం కలిగింది. వెంటనే, నా బాబుని దగ్గరకు తీసుకున్నాను. మన మనసుల్లో కలిగే ఆనందం, ప్రేమ, నమ్మకం…ఆసలు మన మనసు, మన దేహం కూడా ఆ దేవుడి సృష్టి కాదా? అనిపించింది. వెంటనే, నా బాబుకి శ్రీ వైష్ణవ్ అని పేరు పెడదామా అన్నాను. అందరూ సరే అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!