పాశుపతాస్త్రం

పాశుపతాస్త్రం

రచయిత :: వాడపర్తి వెంకటరమణ

డబ్బుల కోసం డబ్బా ఛానళ్ళు పెట్టి/
మేం చూపించేదే నిజమని చెప్పిందే వేదమని/
టీఆర్పీ రేటింగుల సూచికలో/
తమ స్థానాన్ని పైపైకి ఎగదొయ్యడానికి/
ఖద్దరు చొక్కాలకు అత్తరు పూసి/
ఖరీదైన బూట్లకు పాలిష్ చేసి/
ఇన్నాళ్లూ గుట్టుగా చీకటి ముసుగేసుకుని/
నిజాల నిప్పుల్ని పాతరేసి/
తుప్పు పట్టిన ఇనుప కడ్డీలకు/
అబద్ధపు పసిడి పూతను పూసి/
సామాన్యులను పక్కదోవ పట్టించాయి/
కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు!/
ప్రపంచమే కుగ్రామమైన వేళ/
ఇప్పుడు సామాన్యుడి చేతిలో/
సామాజిక మాధ్యమమొక పాశుపతాస్త్రమయ్యింది/
నిజాల్ని నిక్కచ్ఛిగా ఎండగడుతున్నాడతడు/
అబద్ధపు దస్త్రాల్ని అల్లంత దూరానికి గిరాటేస్తున్నాడు/
చక్కర్లు కొడుతున్న/
సామాజిక మాధ్యమాల ధాటికి/
కాలం చెల్లిన ఆ ఛానళ్ళు/
గుర్రుగా చూస్తున్నాయిప్పుడు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!