మేనమామ
వేలు విడిచిన మేనమామ వాడుకలో!
వేలు పట్టి నడిపిస్తాడు ప్రతి వేడుకలో! కానీ
వెన్నంటే ఉంటాడు నా ప్రతి అడుగులో!
అమ్మ తమ్ముడైనా
అత్త మొగుడైనా
అల్లరిలో మాకు తోడు
మా మేనమామ!
ముళ్ల త్రోవలైనా
మురికి వాడలైన
మము పదిలంగా నడిపే
మా మేనమామ!
అక్షరాభ్యాసం లేకున్నా
అక్షర మార్గాన మము నడిపి
అందమైన పూలబాట వేసే భవిష్యత్తుకు
మా మేనమామ!
ఆడపిల్లలమైనా
అవసరాలు కనుగొని
అండగా నిలిచి
అన్నీ సమకూర్చె
మా మేనమామ!
నాన్నకు చెప్పలేని సమస్యలతో
నలిగిన వీల సైతం
నాకై నిలబడే కంచుకోటలా
నా మేనమామ!
అమ్మ ప్రేమను పంచి
ఆత్మీయతలో నాన్నను మించి
ఆపత్బంధువైన స్నేహితునిలా
అక్కున చేర్చుకునె
నా మేనమామ!
రచయిత: శాంతి కృష్ణ
ప్రతి మాట నిజమే శాంతి గారు 👌🏻👌🏻👌🏻చాలా బాగుంది