అమ్మ నా బామ్మ

అమ్మ నా బామ్మ

రచన :ఎన్.ధన లక్ష్మి

రమణ,కమల గారి ఏకైక సంతానం విహస్..విహస్ సాఫ్టువేర్ ఎంప్లాయ్.

బామ్మ మాట అంటే విహస్ అమ్మ ,నాన్నకి వేద వాక్కు..తనకి ఏ విధంగా కూడా అడ్డు చెప్పరు.

విహస్ బామ్మకి జాతకాల మీద కాస్త నమ్మకం ఎక్కువ.. విహాస్ 25 ఏళ్ల నిండేలోపు పెళ్ళీ చేయాలని లేకపోతే తనకి ప్రాణ గండం అని నమ్మి,ఎంతో మంకుపట్టి మరి పెళ్ళి ఐదు రోజులలో సింపుల్ గా జరిగేలా ఏర్పాట్లు చేసింది..

విహస్ కి వరుస అయ్యే దూరపు చుట్టం అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారు. పైగా పెళ్ళిపీటల మీదే వధూవరులు ఒకరిని ఒకరు చూసుకోవాలని ఆంక్షలు పెట్టింది..

విహస్ కి ఏమో ప్రేమ వివాహం చేసుకోవాలని ఆశ. ఆది కాస్త ఇప్పుడు కుదరదు, పోని అమ్మాయి ఎలా ఉందో చూద్దాం అన్న వాళ్ళ బామ్మ వల్ల అది కుదరడం లేదు… తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. పెళ్ళి చేసుకోకుండా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అందరు నిద్ర పోతున్న వేళ హల్ వైపు అడుగులు వేశాడు ఇంతలో లైట్స్ ఆన్ అయ్యాయి…

బామ్మ తాళం గుత్తి చేతిలో పట్టుకొని

” రేయ్, మనవడా! నా నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు రా.. ఇక్కడ ఉన్నది అల్ట్రా మోడరన్ బామ్మ.. వయసుతో పాటు తెలివి తేటలు కూసంతా ఎక్కువే..
నీ బామ్మని రా నేను.. నీకు తగ్గ జోడిని సెట్ చేసాను లే  అంటూ డైలాగ్ చెప్తూ వెళ్తున్న బామ్మ వైపు చూస్తూ షాక్ లో ఉండిపోయాడు విహాస్ “

” అమ్మ నా బామ్మ!.. నేను పారిపోయే అవకాశం లేకుండా నాకున్న అన్ని దారులని మూసివేసావు కదా!! ఇంకా నోరుమూసుకుని ఎవరు వచ్చినా సరే నేను తాళి కట్టాలి తప్పదు అనుకున్నాడు విహాస్. “

పెళ్ళి తంతు మొదలైంది.. వధువు చేతిని వరుడు చేతిలో పెట్టీ పెళ్ళి కూతురు తండ్రి కన్యాదానం చేశారు. అమ్మాయి చెయ్యిని తాకగానే ఏదో తెలియని అనుభూతిని కలిగించింది విహాస్ కి.

జీలకర్ర బెల్లం పెట్టుకోమని పంతులు చెప్పగానే అలాగే చేశారు ఇద్దరు.. వధూవరులు మధ్య ఉన్న అడ్డుతెరని తొలగించారు. అమ్మాయి వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు విహస్. నవ్వుతూ వాళ్ళ బామ్మ వైపు చూసాడు, ఎలా ఉంది రా సర్ప్రైజ్ అన్నట్టుగా లుక్ ఇచ్చింది.

విహస్ కళ్ళ ముందర గతం కదలాడింది…

సరిగ్గా రెండు నెలల క్రితం

విహస్ ఫ్యామిలీ మొత్తం ఓ సాయంత్ర వేళ టివి చూస్తున్నారు..  ఏదో ఛానల్ వారు  ప్రోగ్రాం టెలికాస్ట్ చేశారు. అందులో ఒక అమ్మాయి చేతికి మైక్ ఇవ్వడం ఆలస్యం.. గల గల మాట్లాడుతూ చక్కగా పాట పాడింది. అది విన్న విహస్ .. అమ్మాయి ఎంత అందంగా ఉందో! అంతే అద్భుతంగా తన గొంతు వినడానికి ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది అన్నాడు నవ్వుతూ..

” ఏరా! మనవడా అమ్మాయి నచ్చితే చెప్పు.. పెళ్ళి చేసేస్తా..”

” హే ఊరుకో బామ్మ! టీవీల్లో వచ్చే అమ్మాయి ఎలా తీసుకువస్తావు? పైగా ఛానల్ వారు సరదాగా రోడ్ పై వెళ్తూ అక్కడ కనపడిన వారితో సరదాగా మాట్లాడుతూ తీసిన వీడియో.. అవన్నీ కుదరని పని కాదులే.”

విహస్ అమ్మాయి వైపు చూసాడు. ఆ అమ్మాయి నవ్వుతూ తన వైపు చూస్తుంది. విహస్ నవ్వుతూ ఏమి పేరు అని అడిగాడు. తను నవ్వుతూ వివిధ అంది.

ఇంతలో పంతులు మంగ్యలా ధారణ అనగానే అటు బాజా భజంత్రీల మధ్య వివిధకి తాళి కట్టాడు. బంధువులందరూ వధూవరులను ఆశీర్వదించారు.

విహస్ వివిధ వైపు చూస్తూ ” ఐ లవ్ యూ మై డియర్ వైఫ్ ” అన్నాడు. వివిధ సిగ్గు పడుతుంటే ప్రేమగా తన వైపు చూస్తూ ఉండిపోయాడు.

“ఎలా ఉంది రా మనవడా నా సర్ప్రైజ్!! ఆ రోజు నువ్వు నచ్చింది అనగానే ఛానల్ వారిని కలిసి, వారు షూట్ చేసిన ప్లేసెస్ ఏవోవో కనుకొన్న, పైగా అటు వైపు ఉన్న కాలేజ్ ఒక్కటే. లక్కీగా అమ్మాయి అదే కాలేజ్, వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయాను.. కారణం తను మనకి బంధువులు అవుతారు. అమ్మాయి కి నీ ఫోటో చూపించాను తనకి నచ్చడం, అటు అమ్మాయి తల్లి తండ్రులకి కూడా మన సంబంధం నచ్చడం వారితో మాట్లాడి నీ పెళ్ళి ఖాయం చేయడం జరిగిపోయింది.”

” నువ్వే సూపర్ హే బామ్మ….”

“ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి నీ పొగడ్తను వెనకకి తీసుకుంటావులే.”

” అంటే ఏంటి బామ్మ! హా ఇప్పుడు ఏమి ఫిట్టింగ్ పెట్టబోతున్నావు”.

నీ జాతకం రీత్యా అమ్మాయి, నువ్వు ఆరు నెలలు వేరువేరుగా ఉండాలి. ఈ లోపు అమ్మాయి ఎం.బీ.ఏ కోర్స్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలియకుండా ఏవైనా వెదవ వేషాలు వేస్తే తోలు తీస్తాను అంటు వార్నింగ్ ఇచ్చి వధూవరులను ఆశీర్వదించింది.

విహస్ షాక్స్ బామ్మ రాక్స్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!