నా ప్రేమకథ

(అంశం ::” ప్రేమ” )

నా ప్రేమకథ

రచయిత :: అనురాధ మురుగము బూజుల

ఫోన్ రింగ్ అవుతూ వుంది, అమ్మ కాలింగ్ అని రావడంతో ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసాడు విరించి.
ఆ…. అమ్మ…. చెప్పు అన్నాడు.
ఏమి లేదు విరించి, ఈ సారి పండుగకు ఓ రెండు రోజులు ముందు వస్తే బాగుంటుంది పనులు కాస్త ఎక్కువగా వున్నాయి, నువ్వు కూడా వస్తే…… అని చెప్పింది తల్లి పద్మావతి.
వస్తానమ్మా……. లీవ్ తీసుకొని వస్తాను అని చెప్పాడు విరించి.
తండ్రి లేకపోయినా తల్లి అన్నీ అయ్యి చూసుకుంది, దానికి ప్రతిఫలంగా విరించి ప్రయోజకుడు అయ్యాడు.
సంక్రాంతి పండుగ అందులోను పెద్ద పండుగ అవ్వడంతో ఉత్సాహంగా వెళ్ళాడు. ఇంటికి పొలానికి తిరుగుతూ ధాన్యాన్ని ఇంటికి చేర్చాడు.
మరుసటి రోజు పొద్దున్నే తలుపు తడుతున్న శబ్దం వినపడి నిద్ర లేచాడు, చూస్తే తల్లి కనిపించలేదు. డోర్ దగ్గరికి వెళ్లి చూసాడు, పాలు తీసుకొని ఒక అమ్మాయి వచ్చింది, చూసి లోపలికి వెళ్లి గిన్నె పట్టుకొచ్చి నిలబడితే పాలు పోస్తుంటే, మెల్లగా చూసాడు, మెడలో ఒక చిన్న డాలర్ చైన్, ఇంకాస్త కళ్ళు ఎత్తి చూసాడు, చిన్న బుట్ట కమ్మలు పెట్టుకొని, రెండు లీటర్ల పాలు కొలిచి పోస్తోంది, ఇంతలో విరించి అమ్మ వచ్చి, వీణ “మా అబ్బాయి విరించి వున్నన్ని రోజులు పొసేయ్, తరువాత తగినన్ని పొయ్యమ్మా”, అని చెప్పింది.

ఆ అమ్మాయి….. అదే వీణ…… తల ఊపి వెళ్ళిపోయింది వెనకాల నుండి అయితే…… అబ్బో చెప్పటం చాలా కష్టం. సిటీ భాషలో చెప్పాలంటే “ఫిగర్ సూపర్….. కత్తిలా వుంది”, అని, మెల్లగా సైకిల్ తీసి నిదానముగా ఎక్కి వెళుతోంది, నా మనసు కూడా….. వెళ్ళబోతే,
రేయ్ విరించి, పైకి పోయి నిన్న తెచ్చిన బస్తా తీసుకొచ్చి కిచెన్ లో వేయమని చెప్పింది తల్లి.
తల్లి మాట వినపడటంతో విరించి లోపలికి వెళ్ళిపోయాడు.
తలారా స్నానం చేయించింది పద్మావతి. “అమ్మా తాత ఎక్కడికి వెళ్ళాడు? “, అని అడిగాడు. ఏదో పని మీద తెలిసినవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఈరోజు వచ్చేస్తాడులే అని చెప్పింది.

ఎందుకో ఆ పాలమ్మాయి బాగా గుర్తుకు వస్తోంది, లంగా వోణి వేసుకొని, పండుగ తెచ్చిన దేవతలా వుంది, ఈ కాలంలో కూడా ఇంత పొద్దున్నే స్నానం చేసి వచ్చే అమ్మాయిలు వున్నారా? అని అనుకున్నాడు.
అలా వీధిలోకి వెళితే, ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండు అనుకుంటూ మెల్లగా బయటికి వచ్చి, వీధిలో పడ్డాడు విరించి.
విరించిని చూసి తెలిసినవాళ్ళు బాగా పలకరిస్తున్నారు, ఫ్రెండ్ తిలక్ దగ్గరికి వెళ్లి పలకరించాడు, ఇద్దరూ కలిసి ఊరి మీద పడ్డారు.
ఎంత తిరిగినా ఆ వీణ కనిపించటం లేదేంటి? అని అనుకున్నాడు. రాత్రి భోజనాలు చేస్తుండగా, “ఏరా? పండుగ పూట ఆ తిరుగుళ్ళు ఏంటి? “, అని అడిగాడు తాత.
నవ్వేసి వదిలేసాడు విరించి, పడుకున్న నిద్ర రావడం లేదు, వీణ పొద్దున్నే వస్తుందా? లేక ఇంకెవరైనా వస్తారా? అని నిద్రపోకుండా గుమ్మం వైపు చూస్తూ నిద్రపోయాడు.
మళ్ళీ మువ్వల సవ్వడి వినిపించింది, ఆశగా లేచి చూసాడు, తన ఆశ నిజం అయింది. వీణ మెల్లగా నడుచుకుంటూ పాల కాన్ పట్టుకొని వస్తోంది. లేద్దాం అనుకొనే లోపే పద్మావతి వచ్చి పాలు తీసుకుంటోంది.
అదే నింపాదిగా తల వొంచుకుని పాలు పోస్తోంది. ఎవరితో అయిన ఇలాగే వుంటుందా? నన్ను చూసి తల వొంచుకుని పోస్తోంది అనుకున్నా అనుకుంటూ తల్లి గమనించకూడదు అనుకొని కళ్ళు మూసుకున్నాడు విరించి.
బారెడు పొద్దు ఎక్కాక పద్మావతి వచ్చి నిద్ర లేపింది, చూస్తే పది కావొస్తోంది, “ఏంటమ్మా….. ముందే లేపొచ్చు కదా, అన్నాడు విరించి “.
ఎంత కష్ట పడుతున్నావో? ఏమో? ఇంటిదగ్గర కూడా నిద్రలేక పోతే ఎలా? అంది పద్మావతి. వీణ జాడ కనుక్కోవాలని ఒక్కడే వీధిలో అటు ఇటు తిరుగుతున్నాడు.
పండుగ కావడం వలన అమ్మాయిలు ముగ్గులు పెడుతున్నారు, ఎవరెవరో కనిపిస్తున్నారు, ఈ వీణ ఎక్కడా అని కళ్ళతో వెతుకుతున్నాడు.
ఇంతలో ఒక బాబు పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడ్డాడు, విరించి చూసి ఎత్తుకొని దిక్కులు చూస్తున్నాడు. ఆ బాబు ఏడుస్తున్నాడు.
వీడికి మాటలు కూడా రావు, ఇంత గట్టిగా ఏడుస్తున్నాడు అనుకున్నాడు.
ఆ ఏడుపు విని వీణ వచ్చి బాబుని చూసి విరించి చేతిలో నుండి తీసుకోగానే ఏడుపు ఆపేసాడు. వీణ ను నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు.
ఇంకో పెద్దావిడ వచ్చి బాబుని తీసుకొని, దిష్టి తీసి చీరకొంగులో బాబు ని చుట్టి లోపలికి తీసుకెళ్లింది. చుట్టాలబ్బాయి అనుకుంటా, అరెరే నేను ఇల్లు కనిపెట్టేసాను, మా వీధిలోనే వుంది.
చంకలో బిడ్డను పెట్టుకొని, ఊరంతా తిరిగినట్టు వుంది అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు విరించి.
పండుగ అయ్యాక ఇంకొన్నిరోజులు ఉంటానమ్మ అని అడిగాడు విరించి.
నువ్వు వుండడమేకదా మాకు కావాల్సింది, డబ్బు సంపాదన, అప్పులు తీర్చాలి అనుకుంటూ ఈ రెండు సంవత్సరాలు ఇంటికి దూరంగానే వుంటున్నావు, ఈ మధ్య అన్ని తీరినట్టే, ఇంకో మూడు నెలలు పోతే బ్యాంకులో నుండి తెచ్చిన లోన్ కూడా తీరిపోతుంది. ఇంకా ఇంత కష్టం పడకు విరించి అంది పద్మావతి.
అమ్మా….. నువ్వు కుడా రెస్ట్ తీసుకో, పొలం పనులు చూసుకోవటానికి ఇంకొంతమంది మనుషులను పెడదాము అన్నాడు విరించి.
నీ ఇష్టం విరించి…… కానీ నాకు ఊసుపోయే వరకునా పనులు నన్ను చేసుకోని అంది పద్మావతి.
అంటే…… ఎన్ని రోజులు అని అడిగాడు. నాకు ఒక మానవడో, మానవరా లో ఆడుకోవడానికి వచ్చే వరకు అని చెప్పింది పద్మావతి.
అమ్మ…… నీకు అమ్మాయి విషయం లో ఏవైనా పట్టింపులు ఉన్నాయా? అని అడిగాడు.
మీ నాన్న పోయాక నాకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. మన అనుకొనే పిల్ల వస్తే చాలు, కానీ….. ఏరా? ఎవరినైనా ప్రేమించావా? అని అడిగింది పద్మావతి.
అయ్యో….. అదేమిలేదమ్మా….. అంటూ మెల్లగా జారుకున్నాడు.
యధావిధిగా వీణ పొద్దునే రావటం, వెళ్ళటం అవ్వగానే, వీణ ఇంటికి ఆమడ దూరంలో ఎదురుచూస్తున్నాడు విరించి.
వీణ వెళుతుంటే ఫాలో అయిపోయాడు. వీణ కాలేజీ కి వెళ్ళింది, ఆరా తీసాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది అని తెలుసుకున్నాడు.
సిటీ కి వెళ్లి పని చేసుకుంటున్నా వీణ రూపం మదిలో వుండిపోయింది.
ఫ్రెండ్ రాగానే ఏంట్రా….. ఏంటి ఊరిలో యే పిల్ల మీద మనసు పారెసుకున్నావు? అని అడిగాడు విరించిని.
అలా ఎలా కనిపెట్టావు? రా శేఖర్ అని అడిగాడు విరించి.
సర్లే…. చెప్పు….. అనగానే…. విరించి వివరించాడు.
పాల పిల్లకు పడిపోయావా? అని అన్నాడు శేఖర్.
విరించి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు.
రేయ్ అలా కాదురా….. సరదాకి….. అన్నాడు శేఖర్.
నా చెల్లి ని అన్నా నన్ను అనుకున్నా ఒకటే కదా అనడంతో విరించి కొంచెం తగ్గాడు.
మళ్ళీ వేసవి సెలవుల్లో వీలు చూసుకొని మళ్ళీ ఊరెళ్ళి పోయాడు విరించి.
మళ్ళీ వీణ వెనకాల పడటం చేసాడు. ఈసారి ఏదో కంప్యూటర్ కోర్స్ కి వెళుతోంది.
వచ్చేటప్పుడు…. ఫాస్ట్ గా వీణ ముందు బైక్ ఆపడంతో వీణ కొంచెం భయపడింది.
దగ్గరికి వెళ్లి “నన్ను పెళ్లి చేసుకుంటావా “, అని అడగటంతో వీణ సైకిల్ వదిలేసి వెళ్ళిపోయింది.
విరించికి ఏమి చేయాలో తెలియక బైక్ పక్కన పెట్టి సైకిల్ తీసి పక్కన పెడుతుంటే, వీణ వాళ్ళ పాలేరు వచ్చి, సైకిల్ తీసుకొని మా వీణమ్మ కింద పడింది అంట బాబు, మాదే సైకిల్ అని బ్యాగ్ వెనకాల పెట్టుకుని తీసుకెళ్లాడు.
హమ్మయ్య….. అనుకున్నాడు విరించి.
ఇంకో రెండు రోజుల తరువాత, పాలు పోసి వెళుతుంటే, ఫాస్ట్ గా వెళ్లి సైకిల్ పక్కకు పట్టుకొని వీణ చెయ్యి పట్టుకొని, అడిగితే అలా వెళ్ళిపోతావు ఏంటి? అని అడిగాడు.
వీణ ఏడుపు మెల్లగా మొదలు పెట్టింది. ఏడుస్తే ముద్దు పెట్టేస్తా, అన్నాడు విరించి.
వీణ మౌనం గా నిలబడింది, చెప్పు చేసుకుంటావా?, నువ్వు ఒప్పుకోకపోతే నేనే నిన్ను చేసుకుంటాను అన్నాడు.
ఎవరో వస్తున్నట్టు అలికిడి అవడంతో వీణ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే పారిపోయింది.
ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు విరించి.
మరుసటి రోజు, పొద్దునే తల్లి పాలు తీసుకుంటుంటే అమ్మా, ఆ పిల్ల ఇంటికి కోడలు అయితే ఎలా వుంటుంది అని అడిగాడు విరించి.
పద్మావతి పాలు తీసుకుంటూ వీణ వైపు చూసింది, వీణ భయపడింది, పద్మావతి వీణతో “నువ్వు వెళ్ళమ్మా….. భయపడకు “, అని భుజము తట్టి పంపించింది.
మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేస్తుండగా మళ్ళీ అడిగాడు విరించి.
ముందు అన్నం తిను అని తల్లి లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం మళ్ళీ అడిగాడు విరించి.
పద్మావతి విరించి వైపు చూసి “నిజంగా చేసుకుంటావా? “, అని అడిగింది.
అవును అన్నట్టు తల ఊపాడు విరించి.
ఆ పిల్లకు భర్త పోయి రెండేళ్లు అవుతోంది, ఒక బాబు వున్నాడు, “ఇప్పుడు చెప్పు పెళ్లి చేసుకుంటావా? “, అని అడిగింది పద్మావతి.
విరించికి ఏమి అర్థం కాలేదు. ఏమి మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు మధ్యాహ్నం అయిన రాకపోయే సరికి పద్మావతి వెళ్లి చూసింది, విరించి వొళ్ళు వేడిగా వుండటంతో దగ్గరలో వున్న డాక్టర్ కి కబురు పెట్టింది.
విరించి కోలుకోవడానికి ఇంకో రెండు రోజులు పట్టింది.
ఒక రోజు పద్మావతి కొడుకును అడిగింది. చెప్పు విరించి, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.
విరించి మౌనం గా బయటికి వెళ్ళిపోయాడు.
తిలక్ తో కలిసి బార్ కి వెళ్ళాడు, తాగాలి అని అనిపించలేదు, అలవాటు లేని పని ఎలా చేస్తావు అని అడిగాడు తిలక్.
బయటకు వచ్చేసారు, వీణ గురించి చెప్పాడు విరించి.
పెళ్లి చేసుకోవాలి అని వుంది తిలక్, కానీ…… అన్నాడు విరించి.
రేయ్ విరించి….. నీకు ఏది అనిపిస్తే అది చేసేయ్ అన్నాడు తిలక్.
విరించి డైరెక్ట్ గా వీణ ఇంటికి వెళ్ళాడు. వీణ బాబుకి పాలు పడుతుంటే ఆ పెద్దావిడ వచ్చి “నేను చూసుకుంటాను లే వీణ “, నువ్వు వెళ్లి పడుకో అంది.
వీణ ఆమె ఒడిలోనే పడుకుంది, బాబుని వీణని నిమురుతోంది ఆమె.
మీతో మాట్లాడొచ్చా? అని అడిగాడు విరించి.
ఆమె లేచి వచ్చింది, మీరు అని అడిగింది.
నా పేరు విరించి అండి, మీ వీణను పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను, తనని అడిగితే సమాధానం చెప్పట్లేదు, మీరయినా…. అని అడిగాడు విరించి.
ఇప్పుడు పొద్దుపొయింది, పొద్దున్నే రా బాబు అని చెప్పింది ఆమె.
వీణ కోసం ఎదురుచూస్తున్నాడు, రాలేదు.
తల్లి దగ్గరికి వెళ్లి, పెళ్లి చేసుకుంటాను, ఆ పిల్లనే…. అని చెప్పాడు విరించి.
ఆవేశంలో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకొని, తరువాత చెప్పు అని చెప్పింది పద్మావతి.
వీణ దగ్గరికి వెళ్లి మళ్ళీ అడిగాడు, పలకలేదు, వాళ్ళింటికి వెళితే….. ఆమె వీణ ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు అని చెప్పింది.
వీణ మౌనం విరించికి కోపం తెప్పించింది, సిటీకి వెళ్ళిపోయాడు.
నా ప్రేమ ను ఎందుకు అర్థం చేసుకోదు, అని ఆలోచిస్తున్నాడు విరించి.
ఉండలేకపోతున్నాడు, అయిన వీణ మీద ప్రేమను కోపంగా పెట్టుకున్నాడు.
ఒక ఆరు నెలలు గడిచాయి., వుండలేకపోతున్నారా అని చెప్పాడు శేఖర్ తో….
నీ ఇష్టం విరించి అని చెప్పాడు శేఖర్.
ఇంటికి వెళ్లి తల్లికి మళ్ళీ అదే విషయం చెప్పాడు.
ఒక ఆడపిల్లకు జీవితం ఇస్తాను అనేంత గొప్ప మనసు నీకుంటే కాదంటానా? అని ధైర్యం చెప్పింది తల్లి.
వీణను చూసినప్పుడు నాకేమి తెలియదమ్మా అన్నాడు విరించి.
నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు కదా, అయిన పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంట, మనం ఎవరు చెప్పు ఆపటానికి అంది పద్మావతి.
అయిన నీ మనసు, వెన్న లాంటిది, నీ గొప్ప మనసు…. అంటుంటే……
ఆపమ్మా…… నేనేదో ఘనకార్యం చెయ్యట్లేదు, నాకు నచ్చింది, నాకు ఏమి అక్కర్లేదు అని, అమ్మా…. ఎలా ఒప్పించాలి అని అడిగాడు.
నోటితో కాకుండా…. ఆ పిల్లకు మనసుతో చెప్పు అని చెప్పింది పద్మావతి.
విరించి వీణ కోసం వీణ ఇంటికి వెళ్ళాడు, ఆ బాబు అల్లరి చేస్తున్నాడు. వీణ ఏవో సర్దుతోంది.
వీణ…… నీ సమాధానం అని అడిగాడు విరించి.
చూడు విరించి…… నేను ఒక విధవను, నన్ను చేసుకోవడం వలన ఈ సమాజంలో నీకు విలువ వుండదు, నా జీవితం ఎప్పుడో ముగిసింది, నీ జీవితం ఇంకా మొదలుకాలేదు. మనం కలువని తీరాలు అని చెప్పింది వీణ.
అబ్బో….. మాటలు మాట్లాడటం కూడా బాగా నేర్చుకున్నావు అన్నమాట, పర్వాలేదు వీణగారు, నా జీవితం నీతో మొదలుపెట్టాలని అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే….. అన్నాడు విరించి.
వద్దు విరించి…. వెళ్ళు, మోడిపోయిన జీవితం గురించి ఆలోచించకుండా, నీ జీవితాన్ని చిగురింపచేసుకో, నీ కోసం పుట్టిన అమ్మాయి వుంటుంది వెళ్ళు అని చెప్పింది వీణ.
నీకు అర్థం కాదా?….. కథలు చెప్పకు నాకు, ఎవరేమనుకున్నా పరవాలేదు, ఈ సమాజం అంటావా? వీళ్ళు ఎవరైనా మీకు రూపాయి సాయం చేసారా?
జాలి చూపటానికి ముందు వుంటారు, కడుపు నింపటానికి కనుచూపు మేర కూడా ఉండరు.
ఈ బొంగు సమాజం గురించి నాకు చెప్పకు, ఆ బాబుని తీసుకొని, నీకు నచ్చినా నచ్చకపోయినా వీడిని తప్ప ఇంకొకరిని కనొద్దు సరేనా…..
నీకు ఎలా కావాలంటే అలా వుండు, కానీ నన్ను పెళ్లి చేసుకో, బాగా చూసుకుంటాను.
మా అమ్మ, నువ్వు, తాత, ఇదిగో వీడు….. నీ వాళ్ళు ఎవరైనా వుంటే చెప్పు అందరిని చూసుకుంటా.
అంతేకాదు….. పెళ్లి చేసుకున్న వెంటనే నేనేమి నీమీద పడిపోను, నీ మనసుకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒకటవుదాము.
కానీ ముందు నన్ను పెళ్లి చేసుకొని నాతో వుండు, బతకలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి వెళ్లబోతుంటే……

విరించి…. నేను చెప్పేది విను… అని గేట్ దాక పరిగెత్తుకొని వచ్చింది వీణ. విరించి వీణ మాట వినకుండా వెళ్ళిపోయాడు.
సాయంత్రం…… వస్తుందంటావా తాత….. అని అడిగాడు విరించి.
నిజంగా నా మనవడివి అనిపించుకున్నావు రా విరించి, ఎంత పెద్ద మనసు రా నీది అన్నాడు తాత.
హలో….. ఆ పిల్ల ఇంకా ఒప్పుకోలేదు, నేనేమి గొప్ప పని చెయ్యట్లేదు, నా మనసుకు నచ్చింది చేస్తున్నాను అంతే అన్నాడు విరించి.
పద్మావతి టీ ఇచ్చింది, అమ్మా…. ఏమి చేయాలి అని అడిగాడు.
నీకు అంతా మంచే జరుగుతుంది విరించి అని కొడుకుని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది పద్మావతి.
ఏమో అమ్మా…. ఇంకో పిల్ల అయ్యింటే ఇంకోలా హ్యాండిల్ చేసేవాడిని, కానీ…. అన్నాడు విరించి.
ఏమి బాబు మా వీణకు ఏమి అయ్యిందని, ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు అని అడిగింది ఆ పెద్దావిడ.
విరించి లేచి….. మీరు….. అన్నాడు.
వీణ అత్తను, నా పేరు సరోజ, నువ్వు చెప్పింది నాకు నచ్చింది.
నా కొడుకు పెళ్లి చేస్తే మాట వింటాడని, వీణ ను ఇచ్చి పెళ్లి చేశాను. కానీ వాడు మాట వినడం కాదు కదా, ఇంకా తలకెక్కి కూర్చున్నాడు, నన్నే కాదు, వీణను కూడా చూడలేదు, వాడి ఖర్మ కాలి ఆక్సిడెంట్ లో పోయాడు, తాగి పోవడం వలన డబ్బులు కూడా రాలేదు.
అప్పటికే వీణ నెల తప్పింది, వాడికి తెలియకుండానే పోయాడు. అవసరం లేదని తల్లిదండ్రులు చేతులు కడిగేసుకున్నారు.
నా కూతురు లాంటిది అని నేనే తనను బాగా చూసుకుంటున్నాను.
పెళ్లి చేద్దామని చదివిస్తున్నాను, సంబంధం కూడా చూస్తాను అంటే వద్దు అని చెప్పింది, చాలా ప్రయత్నాలు చేశాను, వీణ ఒప్పుకోలేదు.మా జీవితాలు ఇంతే అనుకుంటుండగా నువ్వు వచ్చావు.
నాకు తెలిసాక మీ ఇంటికి పంపిస్తూనే వున్నాను. నువ్వు లేవు. ఈరోజు నీకోసం గేట్ దాక నా వీణ రావడం చూసి తీసుకొచ్చాను.
వీణను తీసుకొచ్చి, తీసుకెళ్ళు బాబు, ఇప్పుడు…. ఇక్కడ పెళ్లి అంటే, వీణను పది మంది పది రకాలుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు.
సిటీకి తీసుకెళ్లి, పెళ్లి చేసుకోండి, తరువాత కావాలంటే ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ.
బాబు ఏడుపు వినపడి, విరించి వెళ్లి చూసాడు, సరోజ తీసుకొని వెళుతోంది, విరించి వెళ్లి బాబుని తీసుకున్నాడు.
వీణ ఒక్కతే సరిపోదండి, వీడు, మీరు కూడా కావాలి, మీరు తల్లిలాగా చూసుకుంటున్నప్పుడు, మీరు కూడా కావాలండి అని తీసుకొచ్చాడు విరించి.
విరించి చేతిలో బాబుని చూసి వీణ బాబుని తీసుకొని, విరించి ని హత్తుకొని “థాంక్స్” విరించి అని చెప్పింది.
అమ్మో….. థాంక్సా …… వద్దు తల్లి…. నువ్వు చాలు అని అన్నాడు విరించి.
కొన్ని రోజుల తరువాత…….
రేయ్ ఇటు రారా….. అని పిలిచాడు విరించి.
వాడి పేరు నీ పేరు ఒకటే అని చెప్పింది పద్మావతి.
ఏంటమ్మా….. అని అడిగాడు విరించి.
అవును రా….. నువ్వు ప్రపోజ్ చేసాక, తనను పెళ్లి చేసుకోవనుకొని నీ గుర్తుగా నీ పేరు పెట్టుకుంది అని నవ్వేసింది పద్మావతి.
అమ్మా….. వీణమ్మ….. ఏంటమ్మా……. ఏంటమ్మా…… అలా ఎలా ఊహించుకున్నావు తల్లి అని వీణ కోసం వెళ్ళాడు విరించి.
ఏమి కావాలి అని అడిగింది వీణ.
ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి వీణ అని అడిగాడు విరించి.
వీణ నవ్వుతూ వెళ్ళిపోయింది.
ఏమిటో…. పెళ్లి అయ్యి ఇన్నిరోజులు అవుతున్నా ఈ పడిగాపులు ఏమిటో అను కుంటూ వెళ్ళాడు విరించి.
సారీ విరించి….. అని వెనకాల నుండి కౌగిలించుకుంది వీణ.
బాబోయ్ నా ప్రేమకు శుభం కార్డు పడింది అన్నాడు విరించి.
కాదు ఇది నా ప్రేమ కథ, నేనే బాబుకు పేరు పెట్టాను అని చెప్పింది వీణ.
ఆహా…. అలాగా నాకు తెలియదులే, అని ముందుకు తీసుకున్నాడు విరించి.
ఏమి కావాలి అని అడిగింది వీణ.
నాకు నువ్వు చాలు తల్లీ అన్నాడు విరించి.
వీణ నవ్వుతో విరించి సంతోషించాడు.
అలా సమాజం తో సంబంధం లేకుండా హాయిగా వుంటున్నారు “వీణ, విరించి”.
వారి ప్రేమ తెలిసిన ఊరి వాళ్ళు చెవులు కొరుక్కోవడం తప్ప ఏమి చేయలేకపోయారు.
వీణ ప్రేమకథ మొదలుఅయ్యింది.

“శుభం”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!