ఒంటరి

(అంశం ::” ప్రేమ”)

ఒంటరి

రచయిత్రి :: పి. వి యన్. కృష్ణవేణి

చీమ తను ఉన్న, తనకి ఉన్న చిన్న ప్రపంచంలో కూడా వేరే వాటితో కలసికట్టుగా ఉంటుంది. అవును మరి వాటికి డబ్బు విలువ తెలియదు కదా!!!!!!

చిన్న రోబో చీమను తయారుచేసి, రోబొకి ప్రేమించడం నేర్పినట్టు, చీమకు డబ్బు సంపాదించడం నేర్పిస్తే, అది కూడా నాలాగే  ఒంటరి అయిపోదా?

వెంకట్  టీ పెట్టాను చూడు స్టవ్ మీద అమ్మ పిలుపుతో ఆలోచనల వలయం నుంచీ బయటపడ్డాను. ఏంటో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలోనే ఉంటాడు. అమ్మ స్వగతం నన్ను వెక్కిరించినట్టు.

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట,  ఆ వయసులో జరగాలి. లేదా ఇలాగే ఉంటారు జనాలు నాన్న హేళన ఇంకో వైపు నుంచీ. ఇంకో వైపు నుంచీ, చెల్లి నవ్వు.

నాకు ఎందుకో జీవితం మీద ఆశ తగ్గిపోతోంది. అలాగని నేనేదో అయిపోయాను అని కాదు. ఇంకా నాకు ఏమి ఆశించిన విధంగా జరగదేమో అనిపిస్తుంది.

ఆఫీసుకు వెళ్లాలి అనే వంకతో ఇంట్లో నుంచీ బయటపడ్డాను. అవును మరి, ఇంట్లో ఉన్న కాసేపు నా పెళ్ళి కుదరటం లేదు అని ఒకటే గొడవ లేదా ఏవైనా ఖర్చుల జాబితా ముందు ఉంచటం.

అందుకే ఆఫీసులో పని లేకపోయినా, హడావిడిగా బయటకు వచ్చెస్తాను. ఒకప్పుడు అయితే, ఈ సేవ… మన సొంతమేగా ఎప్పుడో వెళదాం ఆనుకునే నేను, ఇప్పుడు తొందరగా ఇంట్లో నుంచీ బయటకు వస్తున్నాను.

నేను అలా ఆలోచనలో ఉండగానే, ఆఫీసుకు వచ్చేశాను. ఎదురు వైపు ఆఫీసులో నా చూపు పడింది.

ఒక అందాల భామ నుంచుని ఎవరితోనో మాట్లాడుతోంది. ఉద్యోగం కోసమా? తనకి ,ఎలాగైనా అందులో ఉద్యోగం ఇవ్వమని చెప్పాలి  వేణుతో. అనుకున్నాను.

మళ్లీ అటు చూసేసరికి, తను నా వైపు చూస్తూ ఉంది. ఒక చేత్తో వెంట్రుకలు సరిచేసుకుంటూ, ఇంకో వైపు చేత్తో ఏదో రాస్తోంది, వేణు ఇచ్చిన పేపర్ పైన.

చూడటానికి అప్సరస లాంటి అందం. నల్లని కనులు. తీర్చిదిద్దినట్టున్నాయి కను బొమ్మలు. పింక్ హాఫ్ స్కర్ట్ పైన వైట్ టీ షర్ట్ వేసుకుని, ఒక చేతికి వాచీ ఇంకో చేతికి స్టోన్ బ్రాస్లేట్ పెట్టుకుని, బెల్ట్ షూ వేసుకుని చాలా స్టయిల్ గా ఉంది.

ఇలాంటి అమ్మాయి, నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే…. అన్న ఊహే నాకు చాలా సంతోషంగా అనిపించింది.

కానీ, ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? ఏ దారి ఎటు పోతుందో ఎవరినీ అడగక… అన్న పాట నా మదిని గిల్లింది.

మూడు నెలల తర్వాత, ఒక మంచి ముహుర్తంలో నేను, ఆ అమ్మాయి, శ్రావ్య మెడలో మూడు ముళ్ళు వేసాను. ఆ రోజు చూసిన దాని కంటే, ఇంకా అందంగా ఉంది. మరి ఇప్పుడు పెళ్లి కూతురు కదా!!!!

వేణు మా దగ్గరకు వచ్చి, అక్షింతలు వేశాడు. ఇద్దరం ఒకేసారి థ్యాంక్స్ అని చెప్పేసరికి వాడు ఒక్కసారిగా నవ్వేసి, థ్యాంక్స్ చెప్పి నా పెమెంట్ ఎగ్గొడతారా అన్నాడు.

అవును మరి, వాడిది మ్యారేజ్ బ్యూరో. అమ్మ నాన్న ఇద్దరికి ఆరోగ్యం బాగుండని కారణం చేత, శ్రావ్య తన పెళ్లి.     అడ్వెర్టైజ్మెంట్ ఇవ్వటానికి ఆ రోజు శ్రావ్య స్వయంగా వచ్చింది. అదీ ఫ్రెండు పెళ్లి పార్టీకి వెళ్లటానికి రెడీ అయ్యి.  ఇంకా ఏముంది, అనుకోకుండా నేను తనని స్వయంవరంగా ప్రకటించడం జరిగిపోయింది.

అలా మేము ఇద్దరం ఒకటి అయ్యాము. కానీ, పెళ్లి అయిన సంవత్సరానికి పురిటికి అని పుట్టింటికి, ఇప్పుడు జాబ్ ట్రాన్సఫెర్ అని వేరే ఊరిలో ఉంటోంది. కష్టపడి చదువుకుని తెచ్చుకున్న మంచి ఉద్యోగం. నేనూ కాదనలేక పోయాను.

మా బాబు, అచ్యుత్ కొన్ని రోజులు నాతో, కొన్ని రోజులు అమ్మతో ఉంటాడు. అలా మళ్లీ నేను ఒంటరిని అయిపోయాను.

జీవితంలో ఎన్నో రకాల ప్రేమలు. ఒకప్పుడు ఆమె ప్రేమ, ఇప్పుడు ఆ ప్రేమకు తోడుగా వీడి పై ప్రేమ తో కూడిన భాద్యత.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!