దీప అందాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
కార్తీక మాసం అమావాస్య
మర్నాడు పాడ్యమి రోజు
తెల్ల వార గట్ల నది స్నానం
గంగ పూజ దీపాలు వెలిగించి
పసుపు కుంకుమ పూలు
అక్షింతలు గంధంతో పూజించి
నదీ ప్రవాహంలో వదిలి పెట్టి
పోలి స్వర్గం కథ చెప్పుకుని
అక్షింతలు వేసుకుని
గంగ పేరుతో ముత్తైదువులకు
తాంబూలం ఇచ్చి గంగ కృపా
కటాక్షములు పొంది ఆరోగ్యం
ఐదవ తనము పొంది కుటుంబ
ఉన్నతి కోసం ఎన్నో రకాల
పుణ్యాలు స్త్రీలు అంతా కలిసి
సామూహిక పూజలు చేసి
శాంతి సౌఖ్యం కోరుతూ ప్రకృతి
పూజ చెయ్యండంలో ఎంతో
ఆనందం ఆహ్లాదం, భారతీయ
సంస్కృతి సంప్రదాయంలో
మనకు పంచ భూతాలు పూజ
ప్రకృతి పూజ తర తరాల సంప్రదాయముగా
నేటికీ ఆధునిక యుగంలో కూడా
అపార్ట్మెంట్ లలో కూడా
పళ్ళెంలో నీరు పోసి పూజ చేసి
దీపాలు వదిలి కథ చెప్పుకుని
అక్షతలు వేసుకుని పుణ్యం
పొందడంలో మన సంస్కృతిని
కాపాడి గౌర్ వించడంలో ఎంతో
స్పూర్తి తృప్తి కీర్తి ప్రతిష్టలు శాంతి శుభము