జీవితం

జీవితం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

మనమెళ్ళే మార్గాలన్నీ సుగమం కాదు,
గతుకుల అవాంతరాలు ఎన్నో…

ఎగుడు దిగుడు అడ్డంకులు ఎన్నో
అన్నింటినీ నేర్పుగా అధిగమించేదే జీవితం

కష్టాల నష్టాలను చూసి భీరువు కాకు
అవియే మనకు నేర్పే జీవిత పాఠాలు

కరిగిపోతున్న కాలానికి కళ్లెం వేయలేవు
కనుమరుగవుతున్న మమతలను తేలేవు

కరుగుతున్న క్షణాలను మళ్లీ తీసుకురాలేవు
జారిపోయిన చేదు స్మృతులను తుడిచెయ్

రాబోయే మధురానుభూతులకు స్వాగతం పలుకుతూ

నిన్న నీది కాదు మార్చలేవు,
రేపు నీది కాదు తీర్చిదిద్ద లేవు,
నేడే మనదన్నది సత్యమని తెలుసుకో
తృప్తి తీరా ఆస్వాదించు, ఆనందించు..

అపజయాలు చవి చూస్తేనే విజయం రుచి తెలుస్తుంది
చీకటి వెన్నంటి ఉండకపోతే, కాంతి విలువేముంది
నిశి రాతిరి వెన్నంటే పగటికి పట్టం కడతాం కదా..

ద్వేషానికి కుంగకు ప్రేమకై అన్వేషించు
కీర్తి ఎప్పుడూ శాశ్వతం కాదు జీవిత గమనంలో…

రాగద్వేషాలు, కష్టసుఖాలు, కీర్తి అపకీర్తి,
విజయాపజయాలు అన్ని కలగలిస్తేనే జీవితం

మరణం అన్నది లేకుంటే జీవిత మాధుర్యం కనలేము

క్షణభంగుర జీవితంలో ఎందుకీ తాపత్రయాలు,
అసూయ ద్వేషాలతో జీవితం వ్యర్థం చేసుకోకు…

లోకమంతా ప్రేమ మయంగా చూడు
భువిలోనే స్వర్గం కనిపిస్తుంది

శత్రువునైనా నవ్వు అనే ఆయుధంతో పలకరిస్తే
దాసోహం అనక తప్పదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!