మధ్యతరగతి భారతం

మధ్యతరగతి భారతం

రచన::శ్రీదేవి విన్నకోట

మధ్యతరగతి జీవితం.
గెలుపోటముల పోరాటం.
అలుపెరుగని ఆరాటం.
రేపటి కోసం ఎదురుచూడటం.
ఏం తినాలన్నా ఏం కొనాలన్నా
ధైర్యం చేయలేనిమొహమాటం.
రోజురోజుకు దిగజారిపోతున్న
మధ్యతరగతి జీవితం.
అనందాలని పూర్తిగా అనుభవించలేని
అవహేళనను
తట్టుకోలేని మానసం.
ఎదుగు బొదుగు లేని జీతం.
సంతోషాలను
అందుకోలేని వైనం.
ప్రతిక్షణం కష్టాల మయం.
అడుగడుగునా
అవమానాల భయం.
తరచుగా ఎదురయ్యే అసహనాల గాయం
అయినా సరే చెదిరిపోని మధ్యతరగతి మందహాసం.
ఆత్మవిశ్వాసంతో
దేన్నైనా సాధించే వైనం
మధ్యతరగతి మనుషుల
నమ్మకం విశ్వాసమే వారి
గుండె ధైర్యం
అల్పమైన సంతోషమే
వారి ఆయుధం
కష్టాల కడలి
మధ్య తరగతి జీవనం.
ఎంత శ్రమించినా మారని
మధ్యతరగతి బ్రతుకు కష్టం.
ఎప్పటికీ ఇదే మన మధ్యతరగతి మహాభారతం
తరచి ఏడ్చినా
తనివితీరని  ప్రహసనం
తరగని కలలతో
ముడిపడిన వైనం
భారంగా నడిచే కదలని కాలం
ఈ మధ్య తరగతి
ప్రశాంత జీవితం
మనకి మాత్రమే సొంతం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!