ఆమె రాకపోతే
రచన: దహగాం రజనీ ప్రియ
ఈ లోకంలోకి ఆమె రాకపోతే….
అలలు లేని సాగరంలా…
కలవలులేని కోనేరులా…
భానుడు లేని మిన్నులా…
వెన్నెల లేని పున్నమిలా….
స్వరం లేని కోయిలలా….
భావం లేని కవితలా….
కాంతి లేని దీపంలా….
ఆమె లేకపోతే….
లోకమంతా చీకటే….
సృష్టికి ఆయువు ఆమె…
ఆమే… జీవన వాయువు…
ఆమె లేనిదే ఈ సృష్టే లేదు…
ఇంతకీ ఆమె ఎవరు???
ఆమే….. “అమ్మ”
***