ఇంద్రుని సలహ

” ఇంద్రుని సలహ”

రచన.  :యాంబాకం

     ఒక ఊరిలో ఒక అందమైన పార్క్ఉండేది.కొంతకాలం ఆ పార్క్ లో నీళ్లు టాంకు కట్టుబడి చేయడం మూలనా ఆ పార్క్ లోకి ఎవరు రావడం మానేసారు. అప్పుడు పార్క్ లో ఉన్న వాచ్ మాన్య్ ని ఉద్యోగం లో నుంచి తీసివేసారు.ఇకపార్క్ కాస్త చిమ్మేవారు లేక చేట్ల తో,పుట్లతో,చెత్తతో
నిండిపోయి పోదలా మారి పోయింది. ఆపార్క్ లో గడ్డి చెత్త ఎక్కువ గా ఉండటం వల్ల మనుషులకి బదులుగా పశువులు, బర్రెలు,గాడిదలు,వచ్చి,తినిపోవడం జరుగుతూ ఉండగా,కొంతకాలం పిమ్మట “ఒక ఎద్దు,ఒక దున్నపోతు, ఒక గాడిద రోజు రావడం వల్ల ఆమూడు స్నేహితులు గా మారాయి.”

ఆమూడు ఒక రోజు పార్కులో రోజులాగే కలుసుకుని లోకాభి రామాయణం మాట్లాడుకొంటూ. ఒకరి గురించి ఒకరు ఇలా చెప్పసాగాయి.

“నేను బలంగల జంతువును నా బలం, నా శక్తి మూలంగా మనుషులు పాడి పంట
అనుభవిస్తున్నారు. రైతులు నన్ను ప్రాణంగా చూసుకొంటారు. పూజిస్తారు, నేను లేక పోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ది లేని లోకులు నాపేరు తిట్టుగా మార్చి “ఒరే ఎద్దు లా నిబడే ఉండకపోతే”అని ఉపయోగిస్తున్నారు. మనుషులు ఒకరి నొకరు నాపేరు తో తిట్టుకుంటుంటే నాకుచెడ్డ కోపం వస్తుంది. ఎన్నాళ్ళు సహించి ఉరుకునేది”అంటూ కొమ్మలు ఇదిలించింది బాధ గా ఎద్దు.

” నేను మాత్రం?   నేను బండచాకిరీ చేస్తాను నీతో సమానం గా సాధువులకు జనాల తో ఒక్క పేచిలేదు. నేను పేద రైతు పెన్నిధిని.నేను చనిపోయినాకూడా నా చర్మముతో చెప్పులు  చేసుకొని  కాళ్ళకు తొడుక్కొని తిరుగుతారు. ఇంకా నన్ను వారి కోరిక తీరగా అమ్మవారికి బలి వివ్వడానికి కూడ వెనుకాడరు. నేను ఎవరికి అపకారము చెయ్యక పోయినకూడ, ఒరే దున్నపోతు లా!వున్నావు అని నా పేరుతో తిట్టు గా మనుషులు వాడటం నాకు ఎలా వుంటుందో చెప్పండి. అని బాధా గా చెప్పింది దున్నపోతు.

“ఓర్పుకు నేనే చిరునామా చెప్పాలి ఎంత బరువు నైనా మోస్తాను. కానీ యజమానికి నాభారం ఏమీలేదు ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడే తింటాను.వానకురిస్తే ఏచూరు దొరికితే ఆచూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏచెట్టు నీడ నో ఉంటా. నా నుంచి యజమాని కి ఇబ్బంది లేదు.ఇంటిలో దొంగలు రాకుండా కాపలా ఉంటాను. అలాంటి నాపేరును. మనుషులు మరీనీచంగా ఒరే గాడిద అని ఉపయోగిస్తున్నారు నేనెవరి తోమొరబెట్టకొనేది అని విచారిస్తూ అన్నది. గాడిద.

“ఒక్క సారిగా మూడు ఎక కంఠంతోఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు” ఏదో ఒకటి చేసి తీరాలి”అని అనుకొన్నాయి.

ఎద్దు, దున్నపోతు, గాడిద, “మనం ఇంద్రలోకానికి పోయీ అక్కడ ఇంద్రుని తో ఈ అన్యాయాన్ని వినిపంచాలి”అనుకొన్నాయి.

అనుకొన్నదే తడువుగా మూడు కలసి ఇంద్ర లోకం ప్రయాణమై ఇంద్రలోకం చేరి ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్రుని కి నమస్కారించ గా.

” ఎందుకు వచ్చారు “?ఆని అడిగాడు ఇంద్రుడు.

“మూడిటి లో ఒకటైన ఎద్దు   దేవేంద్రా! మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తూ బాధ కలిగిస్తున్నారు. మా గొప్ప మేమే చప్పకో కూడదు గానీ,మేము ఆ మానవ కులం కాదు” శివుని వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు అంది ఎద్దు. యముడి వాహనం  నా సంతతివాడు అంది దున్నపోతు,ఇక గాడిద అంది నాగొప్పతనం అందరికి తెలిసిందే. వసుదేవుడే మా సంతతి కాళ్ళు పట్టుకన్నాడు అన్నది గాడిద.

“మీ పూర్వీకులు గొప్ప‌ నేనెరగ నా! అన్నాడు ఇంద్రుడు”

“ఇంతకూ మీకు మనుషులు చేస్తున్న అన్యాయం మేమిటో నాకు తెలియలేదు.వాళ్ళు మీకు ఏమి బాధ కలిగిస్తున్నారో! అని అడిగాడు. ఇంద్రుడు.

“మాపవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడు తున్నారు.అంది ఎద్దు.

“మనుషులు చేసే ఈఅన్యాయాన్ని మీరే అరికట్టాలి అన్నది. దున్నపోతు.

” మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటట్టు చెయ్యాలి”అంది గాడిద.

ఇంద్రుడు చిరునవ్వు నవ్వి “ఇది మనుషుల తప్పు కాదు.  మీ బుద్దులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీరే మీ ప్రవర్తన ‌లు మార్చుకోండీ!వెళ్లిరండి  అన్నాడు.

మూడు జంతువులు భూలోకానికి దారి పెట్టాయి.

“ఈ దున్నపోతు కు మనుషుల లంటే పక్షపాతం “అన్నది గాడిద. “మనం చెప్పేది వినిపించ కోకుండా ఇంకే దో చెబుతాడు ఈ ఎద్దు!అంది దున్నపోతు.”అసలీ గాడిద దగ్గర కి వెళ్ళి మొరపెట్టకోవటమే పొరబాటు అన్నది ఎద్దు.

ఆపక్కనే ఉన్న నారదుడు వాటి మాటలలోని మర్మము ఏమిటో అర్థం గాక ఇంతకీ అవి ఇంద్రుడు ని తిట్టినట్లు గా ఉందే అని నారాయణ నారాయణ అంటూ వెళ్ళి పోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!