సాగర ఘోష
రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి
సూర్య బింబం సంధ్య సమయంలో ఎఱ్ఱని బింబంలా
మెరుస్తూ అమ్మ ఒడిని చేరుతోంటే ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉన్నది
పిల్లలు ఆటోల్లో బడి నుంచి ఇంటికి పక్షులు ఆకాశంలో
మేఘాలలో పోటీ పడుతున్నట్లు పరుగు పరుగున
బాగ్ లతో ఇంట్లోకి వస్తారు
మార్కెట్ లో ఇళ్లకు వెళ్లే వారు వాహనాలపై స్పీడ్ గా వెళ్లిపోతున్నారు కోట్లు సందడి
ఇవన్నీ ఆనాటి బోగాలు
ఎక్కడ కాళీ లేని రహదారులు
నేడు అంతా నిశబ్ధ సంగీతం
ఎక్కడ ధ్వని లేదు సాగర ఘోష
లేదు ప్రశాంత్ వాతావరణము
పిల్లలు ఇంట్లో టీవీ ముందు ఉన్నారు ఆకాశంలో పక్షులు
వాటి గమ్యానికి ఎగురు తున్నాయి
సూర్యుడు సంధ్యవేళ అమ్మ ఒడికి వెడుతున్నడు
ప్రకృతి మామూలే మానవ జీవితంలో మార్పులు చేర్పులు
సాగర ఘోష లా కాక నిస్సబ్ధ
సంగీతం విశ్వమంతా శాంతి.