ప్రాణాంతకిని(స్వగతం)

ప్రాణాంతకిని(స్వగతం)

రచయిత :: పిల్లి.హజరత్తయ్య

పెట్టెలో ఉన్నంతవరకే మంచి దానిని
బయటికి తీశాక నేను మండుతా
మీ జీవితాల్ని మండిస్తా
మీరు నాకు పొగ పెట్టకపోతే
మీ ప్రాణాలను చుట్టేస్తా

నన్ను మీరు ఏ రూపంలో సేవించినా
సరదాగా మీరు మొదలెట్టినా
శరీర అవయవాలపై ప్రభావం చూపిస్తా
పీల్చేవారికి ప్రమాదాన్ని పరిచయం చేస్తా
జీవితాన్ని కారుమబ్బులా కమ్మేస్తా

నా సత్తాకి బిత్తరపోయిన భారతదేశం
రెండో బాధితదేశంగా భారీమూల్యమే చెల్లిస్తుంది
ముప్పును గ్రహించి చైతన్యం పెంచుకోండి
దూరంగాఉండి జీవితాలను రక్షించుకోండి
హ్హ.హ్హా..నేనే..మీ పొగాకుని..మీ పగాకుని..మీ ప్రాణాంతకిణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!