మీరుండగా నాకెందుకు భయం

మీరుండగా నాకెందుకు భయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్

ఏమండోయ్ మిమ్మల్నే వినిపిస్తున్నాదా నే చెబుతున్నది. చాదస్తపు మొగుడు చెబితే వినడు. ముట్టుకుంటే అరుస్తాడు అన్నట్లు నలభై ఏళ్ళ మనకాపురంలో చస్తున్న మీతో అన్న హనుమాయమ్మ గారి అరుపులకి గదిలోంచి బయటికి చేత్తో పేపర్ పట్టుకొని భర్త రామారావు గారు వచ్చారు. ఏమిటే మళ్ళీ ఏమొచ్చింది. అంత గట్టిగా పొద్దున్నే అరుస్తున్నావు అన్న భర్తతో ఆమె
అబ్బే పొద్దున్న ఆరుగంటలకు కాఫీ త్రాగి పట్టుకున్న పేపర్  ఎనిమిది గంటలయిన వదలరు. అందులో ఏముంటుంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తిట్టా. వాడు వీడిని తిట్టా. మా పాలనలో అది చేశాం. మీరెం చేశారు టి.వి లోను ఇదే గొడవ. ప్రేమ విఫలం ప్రేమికుడు ఆత్మహత్య, ఘోర ప్రమాదాలు చెప్పినవే. టి.వి.లో కూడా అవే చస్తున్న. ఏమిటో మీరు  పూర్తిగా మారిపోయారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే నయం బ్రహ్మముహూర్త కాలం లో లేచి స్నానసంధ్యాదులు చేసేవారు. తొమ్మిదో గంటకల్లా స్కూలుకు వెళ్ళేవారు అప్పుడేనయం
కొడుకు మాధవుడిని, నన్ను అత్తగారు మామగారు కన్నకూతురుల చూసుకునే వారు అంటు మాట్లాడుతున్న భార్య తో రామారావు గారు ఆపవే నీ వాగుడు ఇంతకీ అసలు విషయం ఏమిటి అని అడిగారు. హనుమాయమ్మ గారు వెంటనే భర్తతో ఈ రోజు ఎవరొస్తున్నారో తెలుసా మీకేం పట్టనట్లు కూర్చున్నారు అనగానే గుర్తుందే పదకొండు గంటల ఫ్లైట్ కి నీ పుత్రరత్నం మాధవుడు, భార్య, పిల్లలతో లండన్ నించి వస్తన్నాడు.ఆదా నీ భాధ
అవునులే కరోనా మూలాన రెండేళ్ళయింది వాడిని చూసి మనం. మాతృప్రేమ కదా అంటు నీళ్ళు పెట్టావా స్నానానికి అన్నారు. నాకు తెలియదా మీ సంగతి మీ సేవతోనే జీవితం వెళ్ళి పోతోంది అంటు వెర్రి నాగన్న రాక రాక వస్తున్నాడు వాడి కిష్టమైనవి చేస్తున్న. స్నానం చేసి సంధ్యావందనం త్వరగా పూర్తి చేసుకోండి అన్నారు. మాటవరసకి ఎయిర్ పోర్ట్ కి రావద్దన్న కొడుకు మన డ్రైవర్ అప్పారావు కారు తీసుకుని పది గంటలకు వస్తాడు చెప్పాను. మీరు వెళ్ళి కొడుకు, కోడలు, మనవులని తీసుకురండి అంది. పదకొండు గంటలకు రావలసిన ఫ్లైట్ గంట ఆలస్యంగా. పన్నెండు గంటలకు వచ్చింది. చెకింగ్ ఆయిన వెంటనే మాధవుడు, కోడలు, మనుమలు ఎయిర్ పోర్ట్ లోనే రామారావు గారి పాదాలకు నమస్కరించగా ఉత్తరాది పిల్లయినా వినయ, విధేయతలు కలిగి ఉంది, వాళ్ళు క్షేమంగా ఉంటేచాలు అనుకుంటున్న తండ్రితో నాన్నగారు బాగున్నారా, అమ్మ ఎలా ఉంది చిక్కిపోయారు అన్న కొడుకుతో వయస్సు వెళుతున్నాది రా అమ్మ ఎదురు చూస్తుంది. పద మన గ్రేటర్ కమ్యూనిటి కొత్త ఇంటికి నువ్వు వస్తావని మూడు గదుల అపార్ట్మెంట్ మా విద్యార్థి బిల్డర్ భాస్కర్ దగ్గర తీసుకున్నాము అని చెబుతుండగా అపార్ట్మెంట్ రానే వచ్చింది. అపార్ట్మెంట్ ముందు ఉన్న వినాయకుని గుడి దగ్గర పచ్చగా పార్వతీదేవిలా ఉన్న అమ్మ హనుమాయమ్మ రా రా మాధవ మీరంతా కాళ్ళు కడుక్కోండి. తరువాత వినాయకుని కి  నమస్కరించి ఇంట్లోకి వెళదాం అన్నది. తరువాత ఎల్.కె.జి పిల్లాడిని తీసుకు స్కూల్ కెళ్ళినట్లు కొడుకు చెయ్యి పట్టుకుని, మనుమలు, కోడలితో కబుర్లు చెబుతు నాల్గో అంతస్థులో ఉన్న అపార్టుమెంటుకు లిఫ్ట్ లో తీసుకెళ్ళారు. లండన్ లో ల ఇక్కడ ఎంతెంత అపార్టుమెంట్లు అని హిందీ లో కోడలు కొడుకుతో అన్న మాటలు విని బాగుందా మా విశాఖపట్నం ఏ మనుకున్నావు అన్నారు. వెనకే వచ్చిన భర్త మాతృప్రేమ  మరి మనస్సులో అనుకున్నారు.
రాత్రి భోజనాల దగ్గర అమ్మా నీతో చెప్పాలి నేను అక్కడ కంపెనీకి డైరెక్టర్ గా అయ్యాను అనగా చాలా సంతోషం రా ఏమండీ విన్నారా అని పక్కనే భోజనం చేస్తున్న నాతో విన్నానే ఇక్కడే ఉన్నాను కదా అని రామారావు గారు అన్నారు. తరువాత నెమ్మదిగా మేము పది రోజులే ఇండియా లో ఉంటాము ఇక్కడ రెండు రోజులు, తిరుపతిలో రెండురోజులు మా అత్తగారి ఇంట్లో రెండు రోజులు తిరగడం మూడురోజులు నేను లేక పోతే కంపెనీ బాధ్యతలు చూసే వాళ్ళు లేరు అన్న కొడుకుతో రెండు నిమిషాల తరువాత పోనీలేరా భవిష్యత్ నీది ఈ రెండు రోజులు సింహాచలం అప్పన్నని, కైలాసగిరి, బీచ్ అన్నీ చూద్దాం ఏముంది ఇట్టే మళ్ళీ సంవత్సరం వస్తుంది అప్పుడు నాలుగు రోజులు ఎక్కువ శెలవు తీసుకురా! ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అన్న హనుమాయమ్మ ని చూసి భర్త రామారావు గారు ఆశ్చర్యం చెంది ఏమయినా తల్లి ప్రేమ అమృతం అనుకున్నారు. రాత్రి గదిలో భర్త ఇప్పడు నీవు సుఖంగా నిద్రపోతావన్నప్పుడు, తోడు నీడగా జీవితాంతం మీరు నాతో ఉన్నప్పుడు నాకు దేనికి భయం అన్న భార్యని వణుకుతున్న చేతులతో  తలనిమురుతు ప్రేమతో కౌగలించుకొన్నారు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!