నేనూ మీ వాడినే

నేనూ మీ వాడినే

రచన: జీ వీ నాయుడు

నళిని, రాజు ఒకటో తరగతి నుంచి బి ఈడీ వరకు ఒకే కళాశాలాల్లో చదువు కున్నారు. ఒకే ఊరు వారు కావడంతో స్నేహం గా ఉండే వారు. ఇద్దరు ఒకే సబ్జెక్ట్ తీసుకోవడంతో, పుస్తకాలు, రికార్డులు, వగైరా ఇచ్చిపుచ్చుకోవడతో వారి మధ్య కొంత స్నేహబంధం ఘాడత ఏర్పడింది. ఇరువురు ఉద్యోగం వేటలో ఉన్నారు. ప్రభుత్వం డి ఎస్సి నర్వహించక పోవడంతో ప్రవేటు స్కూల్స్ లో పనులు చేసే వారు. కొంత కాలానికి ఇద్దరు ఒకే స్కూల్లో ఉపాధ్యాయులు గా చేరారు. స్నేహం కాస్తా ప్రేమ బంధం గా రూపుదిద్దుకున్నది. ఈ లోపు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం లో చేరారు. ఇలా ఓ సంవత్సర కాలం గడిచింది.నళినికి ఓ అక్కా, చెల్లి ఉన్నారు. అక్కకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు లావణ్య, కుమార్.రెండు, మూడు నెలల్లో వివాహం చెయ్యాలి అని తల్లిదండ్రులు ప్రయత్నం లో ఉన్నారు. రెండో అమ్మాయి నళిని కి కూడా పెండ్లి సంబంధాలు చూస్తే ఖర్చుల్లో ఖర్చు తగ్గిపోద్ది అనేది తల్లిదండ్రుల ఆలోచన. వారిది ఓ పల్లెటూరు కావడంతో అన్ని పాత కాలం నాటి కట్టుబాట్లు ఉన్నాయి. అందులోను వ్యవసాయ కుటుంబం. పెద్దమ్మాయి రాధ పెద్దగా చదువుకోలేదు. నళిని ఒక్కటే ఆ కుటుంబం లో పెద్ద చదువులు చదివి ఉద్యోగం సాధించింది.
ఒక రోజు రాత్రి అందరు భోజనం అయ్యాక ఆరుబయట కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. ఇద్దరు కూతుర్లు వినేలా గా పెండ్లి విషయాలు. నీ ఇష్టం ఏమిటమ్మా అంటూ కుమార్ నళిని అడిగారు. నాకు ఇప్పుడే పెండ్లి వద్దు నాన్న. అక్కకి చూడండి అని బదులు చెప్పింది నళిని. అలా కాదు అమ్మ. ఇద్దరు ఒకసారి అయితే బరువు తగ్గుతుంది అన్నాడు తండ్రి. నీకు ఎవరైనా తెలుసా, అన్నట్లు అడిగాడు కుమార్ నళిని తో. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ కులం వేరు. మీకు పట్టింపులు లేకపోతే నేను ఆ అబ్బాయి ని అడుగుతాను. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం అని చెప్పింది నళిని. “రాజు, మన కులాలు వేరు. నిన్ను మేరేజ్ చేసుకోవాలీ ” అని అనుకున్న అని చెప్పగా అతను నేను మీ వాడినే మనసులు కలిస్తే మనుషులకు కులం ఎందుకు అంటూ దంపతులు అయ్యారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!