ఆధార్ కార్డు

ఆధార్ కార్డు

-నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు భగ భగ మండే వేళ మిట్ట మధ్యాహ్నం గ్రామ.వాలంటరీ వచ్చి బెల్ కొట్టింది

ఎవరూ? అంటూ శ్రావణి వచ్చి తలుపు తీసింది

ఏమ్మా? ఇంత ఎండలో. వచ్చావు మంచి నీళ్ళు ఇవ్వానా.?

వద్దు అమ్మ రేషన్ కార్డ్ కి ఇన్నాళ్లు నేను వెలి ముద్ర వేసి సరుకు తెచ్చి అప్ప చెపుతున్నాను

కానీ ఇప్పుడు అలా కుదరదని చెపుతున్నారు

కారణేమిటంటే ఇప్పటికీ నేను ఆరు నెలలుగా వేస్తున్నా ఇంకా కుదరదు

మీరు మళ్లీ వెళ్లి ఆధార్ కేంద్రం లో. థంబ్ వేసి మళ్లీ స్లీప్ తేవాలి అన్నది సరే మీరు ఎంత తొందరగా తెస్తే అంతా మంచిది అన్నది

మరి ఎప్పుడు వెళ్ళాలి ?

ఈరోజు ఈ ఎండలో వెళ్ళ లేరు ఇక్కడ ఆటోలు ఉండవు

మీరు రేపు ఉదయం వెళ్ళండి అని చెప్పింది

ఏమిటో ఈ విచిత్రం థంబ్ పడదు కళ్ళకి ఫోటో తీసినా పడదు పెన్షన్ రేషన్ ఇవ్వన్నీ లింక్ లు తెల్ల వారి లేస్తే అన్ని సమస్య లే. ఎదో ఇస్తున్నారు అని సర్జి పెట్టు కోవడానికి లేదు నెలకి
ఒక రూల్స్ . ఎప్పుడు ఏ సమస్యా వస్తుందో తెలియదు అందుకే మనుష్యులకు ఆలోచనలు పెరుగు వత్తిడి పెరిగి రోగాలు వస్తున్నాయ్ ఈ రోగాల వల్ల మందుల ఖర్చు పెరుగు తొంది అంతే కాని డబ్బు అదా అవడం లేదు పోనీ రేషన్ మా నే ద్దామా అంటే రేషన్ కార్డ్ కాన్సిల్ అవుతుంది అని చెప్పింది.

సరే అని చెప్పి పంపి తలుపు వేసింది

మళ్లీ రేపు బయటకు.వెళ్ళాలి అంటే తప్పక ఆటో ఖర్చు రెండు వందలు వెళ్ళడం వంద రావడం వంద అయినా తప్పదు అనుకుంటూ గదిలోకి వెళ్లి తల్లికి చెప్పింది

అమ్మా నీ థంబ్ పడదు నా థంబ్ పడదు ఎందుకో తెలియదు

సరే రేపు నేను వెళ్లి చూసి వస్తాను అన్నది

మళ్లీ పనిలో పడ్డారు.

తెల్ల వారింది తల్లికి బూస్ట్ ఇచ్చి శ్రావణి తాగి. ఇడ్లీ వేసి అల్లం ధనియాల పచ్చగివేసి పెట్టింది. అమె తిని స్నానం చేసి వచ్చి పూజ చెయ్యడానికి కూర్చుంది

శ్రావణి కుక్కర్లో పప్పు టమోటో పెట్టీ అన్నంపెట్టీ కుక్కర్ పెట్టింది ఈ లోగా ప్రెషర్ పాన్లో బంగళా దుంపలు పెట్టింది రెండు కూడా కూతలు వచ్చాయి

స్టవ్ కట్టి ఆఫీస్ కి కావాల్సిన ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకుని వెళ్లి బ్యాగ్ లో పెట్టింది వెయ్యి రూపాయలు పర్సులో పెట్టు కున్న ది ఈ లోగా కుక్కర్ కూల్ అయింది విప్ప దీసి పప్పు పోపు వేసి కూర మూత తీసి కారం వేసి గిన్నెలోకి మార్చింది పప్పు వేరే మూకుడులో పెట్టీ పోపు వేసి గిన్నెలో పెట్టీ అన్నం తీసి హాట్ ప్యాక్ లో పెట్టింది. అన్ని తెచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టీ కంచం మంచి నీళ్ళ బాటిల్ పెట్టీ సర్ధి ఉంచింది.

అమ్మ నువ్వు పూజ అయ్యాక భోజనం చెయ్యి ఆఫీస్ పనులు అంటే ఒక పట్టాన తేమ లవు అని చెప్పింది.. బయట తలుపు వేసి వే డ తాను నువ్వు జాగ్రత్తగా పొల మారకుండా అన్నం తిను అని చెప్పి బయలు దేరింది

సందు చివరకు వెడితే గాని ఆటో దొరకదు మధ్యలో దొరికితే బాగుండును అనుకున్న ది అయినా తప్పవుకదా పెట్టిన రూల్స్ ప్రకారం అన్ని కాగితాలు అప్పా చెప్పాలి అనుకుంటూ
ముందుకు వచ్చి లిఫ్ట్ ఎక్కి దిగింది

గేట్ దగ్గర ఎవరో ఆటో లో వచ్చారు అతను వెళ్లకుండా ఉండమని పిలిచి వెళ్లి ఆటో ఎక్కింది పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి

సరే ఎక్కండి అని చెప్పాడు

పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగింది

అప్పటికే మెట్ల మీద ఖాళీ లేకుండా పిల్లా మేక పెద్ద కూర్చున్నారు లోపలికి వెళ్ళి ఆధార్ కౌంటర్ ఎక్కడా అని ఒక అమ్మాయిని అడిగింది ఆ జనం ఎక్కువ ఉన్న కౌంటర్ అన్నది అక్కడ ఓ రెండు వందల మంది క్యు లో ఉన్నారు

సరే ఇంకా తప్పదు అని వెళ్లి క్యులో నించుంది

అదృష్టం బాగుంది తొందరగా ఫారాలు అందరికీ ఇచ్చి క్యు లో జనం తగ్గి పోయారు

చాలా తమాషాగా క్యు అంతా తగ్గి పొయింది శ్రావణి వంతు వచ్చింది

మేడం మీ కు ఏమీ కావాలి అన్నాడు ఆధార్ నీ ఫోన్ లో సంధానం చెయ్యాలా అన్నారు

థంబ్ పడటం లేదు అందుకు మరి సరి చెయ్యాలి

సరే మేడం ఇప్పుడు అవదు
ఎప్పటికీ లోపల నిన్నటి ఫామ్ పూర్తి చేసి తెచ్చిన క్యు ఉన్నది

ఈ రోజు వాళ్ళకి రేపు ఇస్తాము
అని ఫామ్ లో నంబర్ వేసి ఇచ్చారు

ఏమీ చెయ్యగలను?

సరే నేను ఒక గంట ఇక్కడే ఎదురు చూస్తాను అన్నది

పని అవదు ఊరికే మిమ్మల్ని
మభ్య పెట్ట కూడదు

అందుకని రేపు రండి అదికూడా పన్నెండు గంటల తరువాత రండి

సరే అని బయలు దేరి వచ్చి
మార్కెట్ దగ్గర ఆటో ఆపమని చెప్పి మందులు కూరలు కొన్నది

ఆ చేత్తో జీరాక్స్ షాప్ లో కి వెళ్ళి పది ఆధార్ కార్డ్ లు నాలుగు రేషన్.కార్డ్స్ ప్రింట్
వేసి ఇమ్మని చెప్పింది

షాప్ వాడు బావున్నా రా మేడమ్ అని చెప్పి కుర్సీ ఇచ్చాడు

సరే తొందరగా ప్రింట్ ఇయ్యి ఆటో వెయిట్ చేస్తోంది అన్నది

అన్ని పుచ్చుకుని ఆటో ఎక్కి ఇంటికి వచ్చింది

సరుకులు తీసుకుని దిగి లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చింది

శ్రావణి తల్లి అప్పటికి పూజ ముగించుకుని అప్పుడే వచ్చావు పని అయ్యిందా అని అడిగింది తలుపు తెరుస్తూ !

లేదు అమ్మా ఇంకా అవలేదు
అంతా తొందరగా అవుతాయా

ఆధార్ సరి అవ్వాలి అంటే ఇంకా టైమ్ పడుతుంది

ఇది ఎదో చేతిలో ఉన్నట్లు ఉదయమే తొమ్మిదికి వెళ్ళ మన్నది వాళ్ళ రూల్స్ వారిది
మళ్లీ రేపు పన్నెండు తరువాత
రమ్మాన్నాడు లోపల వేరే పోస్ట్ మాన్ ఈ కార్యక్రమం చూస్తాడు అని చెప్పింది

నువ్వు అన్నం తినకుండా వెళ్లవని కంగారు పడుతూ ఉన్నాను

పోనీలే రేపు అన్నం తిని వెళ్ళ ఇంకా ఆలస్యం ఎంత అయినా
ఫర్వాలేదు అంటూ కంచం లో అన్నం పెడతాను అన్నది

వద్దు వద్దు అక్కడ రక రకాల మనుష్యులు ఉన్నారు
బట్టలు మార్చి అవి తడిపి అప్పుడు భోజనం చేస్తాను
నువ్వు తిను అన్నది

సరే ఇప్పుడు ఇదో సమస్య
బయటకు వెళ్లి వచ్చి అన్ని మార్చాలి సరే అన్నది

ఈ లోగా.వలేంట రీ ఫోన్ చేసింది
మేడమ్ పని అయితే నాకు ఫోన్ లో పెట్టండి స్క్రీన్స్ షాట్
పెట్టాలి అని ఓ ఖంగారు పడ్డది

అయ్యి అసలు పని కాలేదు
అంటూ అక్కడి విషయం చెప్పింది
అంతా మందికి థంబ్ పడకపోతే వేరే విధంగా వేరే కార్డ్స్ ఇవ్వాలి కానీ ఇలా మళ్లీ ఆధార్ సిస్టమ్ లో మార్పు అంటే చాలా కస్టమ్ కదా

ఏమిటో ఈ ఆధార్ లేనిది ఏమి
పనులు జరగవు అన్నది

కానీ మేడమ్ వాళ్ళు చెప్పిన వెంటనే ఎక్కడ నుంచి మారి
వస్తుంది కొంచెం టైమ్ ఇవ్వాలి
అన్నది శ్రావణి

అవును మేడమ్ మాకు చాలా వత్తిడి ఇస్తున్నారు

ఏ ది నిన్న కదా చెప్పావు
ఈ రోజే ఎలా ఇస్తారు

ఇది ఒక్కళ్ళ సమస్య కాదు దేశం సమస్య కాదా నేను మీ ఆఫీసర్ తో మాట్లాడుతాను
నంబర్ ఇయ్యి అన్నది

మాకు చాలా వత్తిడి ఉంటుంది పరుగు పెట్టిస్తారు మేడమ్ అన్నది

అలాంటప్పుడు మీకే వాళ్ళు పెర్మిషన్ కార్డ్స్ ఇవ్వమంటే
థంబ్ పడని వాళ్ళకి మీరు
కార్డ్ ఇచ్చి సంతకం పెట్టుంచుకుంటారు ఆ పద్దతి
మంచిది
సరే ఈ రోజు పని కాలేదు
రేపు మళ్ళీ వెళ్లి వచ్చాక ఈవిషయం చెపుతాను అంటూ ఫోన్ పెట్టింది
మరి ఆధార్ అంతా తేలికగా వస్తుందా ఆలోచించండి

రాత్రి పగలు కస్టపడి చదువుకుని ఎలక్ట్రానిక్ వెలి ముద్ర కోసం ఈ తంటాలు
ఇంకా చదివిన చదువు విలువ ఏమిటి?

రాత్రి బడుల లో ఎంతో కష్ట పడి అక్షరాలు దిద్దించి పేర్లు నేర్పారు ఇప్పుడు అవన్నీ ఎటు వెళ్లి పోయాయ్యో తెలియదు కదా
పీహెచ్ డీ చదివిన వారు సహితము థంబ్ వేసి పుచ్చు కోవాలి

శ్రావణి డాక్టరేట్ చేసింది అయినా థంబ్ వెయ్యాలి అని అనడం వల్ల ఈ సమస్య వచ్చింది లేదంటే కార్డులో పేరు ఉండదు రేషన్ ఇవ్వరని వలెంటర్ చెప్పింది కనుక శ్రావణి లాంటి ఎందరో విద్య వంతులు థంబ్ తో ఉద్యోగాల్లో కూడా తంటాలు పడుతున్నట్లు
చెపుతున్నారు

ఎక్కడి నుంచో పుట్టుట గిట్టుట నిజము న ట్ట నడిమి పని. నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన శ్రావ్యంగా వినిపిస్తోంది

మరి నిజమే కదా ఎన్నో పథకాలు వాటికి ఎన్నో హిరణ్యాక్ష పద్దతులు ఇంకా సామాన్యునికి అందే దెలా చెప్పండి అందరూ ఆలోచించాలి కదా

ఆధార్ నువ్వు వర్ధిల్లు అనాల
ఏమి అనాలి చెప్పండి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!