మేకిన్ ఇండియాకి కదం తొక్కుదాం
రచన::వడ్డాది రవి కాంత్ శర్మ
కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆఫర్లు…
లేని అవసరాన్ని సృష్టించే…
వ్యాపారపు ఎత్తుగడలు…
అమాంతం పెంచే ధరలు..
కేవలం మీకు మాత్రమే తగ్గింపు అని మరిపింప చేసే…
ఆన్లైన్ అంగట్ల మాయదారి ప్రకటనలు…..
వలలో చిక్కిన మధ్యతరగతి మనస్తత్వాలు..
మరింతమందికి ఎర్రగా మారిన ప్రాయాలు..
కొన డాలు కొనిపించడాలు…
పుట్టినరోజుకు నేరుగా పంపడాలు….
కుదేలైన చిన్న వ్యాపారాలు….
జాడ కరువైన బేరసారాలు….
నియంత్రించాల్సిన ప్రభుత్వ విధానాలు…..
నింగిని తాకుతున్న వ్యాపార విన్యాసాలు….
ప్రోత్సహిద్దాం దేశీ ఉత్పత్తుల్ని…
గర్వంగా ధరిద్దాం సాంప్రదాయ వస్తువుల్ని…
బహుళజాతి కంపెనీల ఇంద్రజాలానికి…
కాస్త విరామం ఇద్దాం…
మేకిన్ ఇండియా కి కదం తొక్కుదాం…
***