అల్ప సంతోషిని..

అల్ప సంతోషిని..

రచన: డాక్టర్ అడిగొప్పుల సదయ్య

ముద్దులొలికెడి లేత- మొగ్గలగు బాలకుల
బోసి నవ్వులలోన-పూసె పువ్వుల జూస్తె,

డస్సిపోయిన పండు- టాకులగు వృద్ధులకు
ఊతలా కర్రనై- చేతిలో నేనుంటే,

కల్లలసలేలేని- ఎల్లలెరుగని వడితొ
విహరించు పులుగులే- వెలుగుతూ కనబడితె,

పచ్చలు,కెంపులతో- పరగ ముస్తాబయ్యి
నిగనిగలుపోవుచూ- నగములగుపడినపుడు,

ఆకాశ వీధిలో హరివిల్లు- విరబూసి
రంగులను వెదజల్తు- రమ్యముగ కనబడితె,

బెదురుచూపులతోడ-బేలలై చరియిస్తు
మేతకై యేతెంచు- మెకములగుపడినపుడు,

ఎత్తైన కొండపై ఏడేడు లోకాల
నేలేటి దేవుడే నేరుగా కనబడితె,

అల్పసంతోషినే నమిత హర్షుడనౌదు
నందసుత! నీకన్న నానందమేముంది?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!