ఆకాశంలో అద్బుతం

ఆకాశంలో అద్బుతం

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

గగనసీమలో సప్తవర్ణసమన్వయం
సహజసౌందర్యసుశోభితం
కమనీయదృశ్యము చూపరులకు
రమణీయచిత్రము రసికులకు
పృకృతి వేసిన రంగులరంగవల్లి
వర్షసూచనకు తొలిమరుపు
వర్షానంతర తుది వెలుగు
వరణుడు విసిరిన వలపుబాణమే
పరవశించని హృదయముండదు
పసిపాపలకొక అద్భుతానందమే
ఆకాశవీధిలో పరచిన ఎడురంగులకోకేమో
అశ్చర్యముకలిగించే మనోహరదృశ్యముకాదా
ఇంద్రధనస్సు శాస్త్రీయ పరిణామమే
ఇంద్రచాపము దివిపై వెలసిన రంగులవల
ఇలపై ఇనుమడించిన దైవసన్నిధానమే
ఇనకుడే కాదు  స్వర్గాధిపతులకు ఇష్టమే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!