జస్టీస్ అమరేశ్వరి

జస్టీస్ అమరేశ్వరి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం మొదలు మనం ఎన్నో రకాల మనుష్యులలో మానవతా విలువలు కలిగిన ప్రతిభ
నుంచి స్ఫూర్తి పొందుతాము. చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు విద్య, కళలు అన్నిటిలో మనకు  ఆదేశం ఆదర్శంగా ఉన్న వ్యక్తులు నుంచి మనం స్ఫూర్తి పొందుతాము. మన ఇంటి పెద్దలు గురువులు ఇంటికి వచ్చే ప్రముఖ అతిథులు వీరంతా కూడా జీవితంలో స్ఫూర్తి ప్రదాతలే. అలా నా ఇంటి పెద్దలు నాకు స్ఫూర్తి నీచ్చారు. మా ఇంటికి ప్రముఖులు అభిమానుల వస్తూ ఉండేవారు. ఎవరు కళాకారులు, సాహితీ వేత్తలు వచ్చి నప్పుడు మా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేవారు. అలా ఎందరి దీవెనలు నాకు ఉన్నాయి. అటు చిత్ర కారులు
ఇటు సంగీతకారులు, ఇటు నృత్యకారులు, అటు వాయిద్యకారులు, ఇటు జ్యోతిష్య ప్రముఖులు అటు సాహిత్య కారులు, ఇటు సేవతత్పరులు.ఇలా ఇంట్లో ఎవరో ఒక అతిధి వారి కూడా వారి సహచరులు వస్తూ భోజనాలు, అల్పాహారం ఏర్పాటు ఉండేవి. ఒక్కోసారి ఇంట్లోనె ఉపన్యాసాలు స్వామీజీ పూజలు సత్కారాలు ఉండేవి. ఇలా నిత్యా నూతన శోభాయమానంగా సరస్వతి రూపాల సన్మాన కార్యక్రమంలో ఆనంద స్ఫూర్తి ఉండేది. అల అన్ని రంగాల సాధన, శోధన చెయ్యాలనే తపన ఉండేది. ఆ వచ్చిన వాళ్ళకి బోకెలు ఇస్తూ వారిని గౌరవిస్తూ ఎంతో కృషి చేశాను. అలా వారితో మాట్లాడి వారి ఉపన్యాసాలు విని నేను కూడా అల ఎదగాలి అనే దృడ సంకల్పం వచ్చి స్థిరనిశ్చయం చేసుకొని వారినీ ఇంటర్వ్యూ చెయ్యడం ద్వారా ఎన్నో విశేష అంశాలు సొంతం అవుతాయి.
అని నేను రచయిత్రిగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా రాయడం అలవాటు చేసుకున్నాను. ఇంటికి వచ్చిన అవకాశం మరింత మందికి తెలియ చెప్పాలి అనే  ఉద్దేశంతో నేను సాహితీ వేత్తగా కృషి చేశాను. పత్రికల వాళ్ళు నేను పంపేదానికి అత్యంత ప్రోత్సాహం ఇచ్చారు. ప్రముఖ మహిళా పత్రికలకు చిన్న వయసు నుంచి రాసేదాన్ని వనిత వనితా జ్యోతి కలువ బాల దిన పత్రికలలో రెగ్యులర్ కాలమ్స్ వస్తూ ఉండేవి. ఎడిటర్స్ సలహాలు మాత్రమే నాకు శ్రీ రామ రక్ష అని అంటాను.నేను డిగ్రీ తరువాత జర్నలిజం కోర్స్ చేస్తాను అంటే వారు మీకు ఆ కోర్స్ అవసరం లేకుండానే వందకు పైగా ఆర్టికల్స్ వచ్చాయి. వాటిలో వైవిధ్యం పరిశీలించి రాయడం అలవాటు చేసుకున్నాను.
డాక్టర్ సంజీవ్ దేవ్ గారు చెప్పినట్లు నీకు నీవే గురువు నీకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు అన్నారు. అలాగే శ్రీమతి జస్టీస్ అమరేశ్వరీ తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి గారు మా తణుకు ఒక ప్రముఖ కార్య క్రమానికి విచ్చేసి నప్పుడు మరొక వృద్ధుల సంస్థలో అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించినప్పుడు పత్రిక వారు కేవలం ఆ స్పాట్ న్యూస్ ఇస్తారు. అలా కాకుండా పూర్తి జీవిత విషయాలు రాసేవారు కావాలి అన్నప్పుడు పేపర్ రిపోర్టర్స్ మాకు జిల్లాకు మాత్రమే స్టేట్ కు పర్మిషన్ ఉండదు అన్నారు. ఆ సమయంలో మా పెద్ద తల్లి
శ్రీమతి సంపూర్ణ చంద్రిక గారు సకలకళాప్రపూర్ణ గా పేరు పొందిన ఆమే నన్ను ముందుకు తీసుకెళ్లి చూపించి మా అమ్మాయి పత్రికలకు వ్యాసాలు రాస్తుంది. ఈమే రాస్తుంది మీరు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. వెంటనే ఆమే మూడు గంటలకి రండీ అన్నారు. గబ గబ ఇంటికి వచ్చి భోజనం చేసి ఆవిడుకి అభినందన పత్రంరాసి ఎండు కొమ్మలతో బటర్ పేపర్తో చక్కని బోకే చేసి సెంటు పూసి,
సెలోఫిన్ పేపర్ లో చుట్టుకుని తయారీ చేశాను. ఆమే ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అది చాలా దూరం, కెమెరా మాన్, నేను పెద్ద తల్లి, నా కజిన్ వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ కి చెపితే లోపలికి లిఫ్ట్ లో తీసుకుని వెళ్ళారు. చాలా సెక్యూరిటీ ఉన్నది కారణం అప్పుడు కాంప్లి కేటెడ్ వర్క్ లో ఉన్నది. ఆమెకు సెక్యూరిటీ ఇస్తేనే పంపుతాను అన్నారుఆమే కూడా ఏలూరు నుంచి ముఫై బుల్లెట్స్ తో పదిహేను కార్లు తో ఆవిడ ఫాలో వర్స్ వచ్చారు.అదే చాలా క్లిష్ట పరిస్థితులు అటువంటి సమయంలో ఆవిడ వచ్చారు మాకు ప్రత్యేక ఇంటర్వ్యు ఇచ్చారు.
బెల్ కొట్టగానే వచ్చి డోర్ తీసి కూర్చో మన్నారు. టీ తీసుకొమన్నార్ కెమెరామన్ తాగాడు, పెద్దతల్లి తాగరు, ఎంతో సింపుల్ గా ఈ చీర బాగుందా! వేరే కట్టుకోనా అన్నారు. అది కోటా చెక్స్ డార్క్ బ్లూ చీర నలుపు జాకెట్ చాలు మేడమ్ బాగుంది. ప్రింట్లో బాగా వస్తుంది అన్నాము. అంతే ఆవిడ మీ గురించి చెప్పండి అని ఒక్క మాట అన్నాను, వెంటనే మూడు న్నరకు మొదలు పెట్టిన ఆమె విషయాలు ఆరున్నర వరకు సాగుతూనే ఉంది. నయాగరా జలపాత ప్రవాహంలా అవి వాగ్ధోరణి అప్పటికే బయటినుంచి ఆవిడతో పర్సనల్ గా మాట్లాడ టానికి ఎందరో పెద్ద పరముఖులు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము తలుపు తీసుకుని బయటకు వస్తుంటే ఒక ప్రముఖ వ్యక్తి నువ్వా సంపూర్ణ వీళ్ళు జర్నలిస్ట్ ల ఇంటర్వ్యు అన్నారు. ఈ పిల్ల మీ అమ్మాయి కదూ అన్నారు. హోష్ మీరా! అవును మా పిల్లే ఇంటర్వ్యు చేస్తా అన్నది. అప్పుడు పబ్లిష్ కాగానే నాకు చెప్పు నేను కొనుక్కుంటాను అన్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యు చేసి నట్లు కార్డ్ పంపాను. దానికి ఆయన కంగారు పడుతు నువ్వు నిదానంగా ప్రశ్న జవాబులు రాయాలి. నేను హైదరాబాద్ వెళ్ళ ఐదు సార్లు పర్మిషన్ అడిగితే అదిగో సమయం లేదు ఇదిగో సమయం లేదు అని కూర్చో పెట్టీ కార్లో వెళ్ళిపోయాక..మెడంకి కుదరలేదు అని చెప్పేవారు.
మీకు ఇంత నిదానంగా ఇన్ని గంటలు ఇంటర్వ్యూ చాలా అదృష్టం అని పొగుడుతూ ఉత్తరం రాశారు.
అలా ప్రముఖుల ఆశీస్సులు అందాయి. ఆ పత్రిక రాగానే అందరికీ చెప్పాము కొందరికి బుక్ ఇచ్చాము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!