వానచినుకు

వానచినుకు

రచన :యాంబాకం

వానచినుకు
చినుకు చినుకు
ఒకటి కి ఒకటి
రెండుకు రెండు
తోడై ఒదిగి ఒదిగి
చేరువై చేరువై

బారులై చిన్న పాప
లా దోగాడుతూ. చిన్న
పాయలై ఏకమై జాలు
వారి జాలువారి సన్న
తీగ కాలువై పిల్లకాలు
వై తీగలాపాకీ పొడవై

సాగి కొంచెం కొంచెం
పెరిగే పాపలా సాగే
ఎర్రని యేరై యేరు యేరు
జల జల పారే కొండ
వాగై కోనలు నడుమ

జారుతూ హోరు హోరు
మంటూ పారేనదివై
ఎవరి కోసమో వెతుకు
తూ పరవళ్ళు తోక్కుతూ
పక్కచూపు చూడక వెనుక

చూపులు తెలియక ఎదో
ఆశగా నిరాశగా పుట్టి
పుట్టుక తెలిసేలోపు ఎవరి
తో పనిలేదు నాకు ఆంటూ
పసిపాపలా పదహారు అనాల

పడుచువై ప్రేమతపస్వి
వై నాట్యమయూరివై
తాండవం చేస్తూ ఎదురులేని
మహారాణి వై త్రి
లోకాలు స్పందింపగా

ఎవరి కోసమో ఈ ప్రయాణం
సముద్రుని చేరగా శాంతి
మూర్తి వై కొత్త పెళ్ళి కూతురై
ఒదిగి ఒదిగి పోతివే ఓ”వానచినుకా”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!