కుటుంబమా నీ జాడేది

కుటుంబమా నీ జాడేది

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

ప్రేమలు ఆప్యాయతలు
ఉన్నాయా అనిపిస్తుంది
కుటుంబ వ్యవస్థ
రోజు రోజుకు దిగజారిపోతుంది
వసుదైక కుటుంబం అనేది
ఓ కలగా మిగిలి పోయింది
చిన్న కుటుంబం
చింతలు లేని కుటుంబం
కానీ,
బంధాల విలువ తెలియదు
ఆప్యాయతా అనురాగాల కరువు
ఆపోహలు, అనర్థాల మయము
పెద్దల పై గౌరవం శూన్యము
ఎవరి లోకం వారిది
ఎదురెదురుగా ఉన్నా
మనసులు దూరం
ఆలోచనల లో బేధాభిప్రాయాలు
ఎటు పోతుందో ఈ వ్యవస్థ
ఆనాటి సఖ్యత ఆనందాలు ఎక్కడ
చెప్పేవారు కరువయ్యారు
వృద్ధాశ్రమాలు దగ్గరయ్యాయి
సమాజ తీరు మారేదెన్నడో
కుటుంబ వ్యవస్థ బాగుపడేదెన్నడో
ఒకసారి ఆలోచించండి
కుటుంబ వ్యవస్థను
బాగుపరచండి

You May Also Like

3 thoughts on “కుటుంబమా నీ జాడేది

  1. శ్రీ విద్య గారు కుటుంబం మనుగడ గురించి బాగా వర్ణించారు. బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!