ఇష్టాలు-కష్టాలు

అంశం: ఇష్టమైన కష్టం

ఇష్టాలు-కష్టాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: లహరి

పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టాలని,
అదనంగా పనిచేసే ఇష్టమైన కష్టం తల్లిది..
పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలని,
కాయకష్టం చేసే ఇష్టమైన కష్టం తండ్రిది…
ఒంట్లో సత్తువ లేకున్నా మనవలు,
మనవరాళ్ళకి తినుబండారాలు చేసి పెట్టె ఇష్టమైన కష్టం అమ్మమ్మది…
ఆరోగ్యం కోసం దాచుకున్న డబ్బు నుండి
మనవళ్లకు తాయిలాలు ఇచ్చే తాతయ్యది ఇష్టమైన కష్టం…
బరువు బాధ్యతలతో తలమునకలుగా మునిగినా,
ఇష్టమైన కష్టాన్ని ఒక్కో తీపి జ్ఞాపకంగానే మలుచుకుంటూ.
మధుర జ్ఞాపకాలు  అందుకోవాలని పడే ఆరాటాలు ఎన్నో  మన జీవితంలో..
అన్ని ఇష్టమైన కష్టాలే…

You May Also Like

One thought on “ఇష్టాలు-కష్టాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!