బలిగొన్న బానిసత్వం

(అంశం:”బానిససంకెళ్లు”)

బలిగొన్న బానిసత్వం

రచన: నెల్లుట్ల సునీత

చరిత్ర పునాదుల్ని పెకిలిస్తే
స్వార్థ ప్రయోజనాలకు బలయిన బతుకులెన్నో

విలువల్ని చంపేసి
హింసలకు తెరలేపి
ధనవంతుల కుటిల వ్యవస్థల
ఆదిపత్య దోపిడిల పర్వంలో
పేదరికమే శాపమై
బతుకులను బలిగొన్న బానిసత్వం
రక్తం నీరై కారిన జవసత్వం

తాడిత పీడిత వర్గపు
హక్కుల్ని దోచేసి
ఆకలి ఆర్తి ఆవేదన ఆలోచనకోసం
తనను తాను అమ్ముకొని
ఆవిరైన చెమట చుక్కల్ని తాకట్టుపెట్టి

ప్రయోజనాలు ఆశించకుండా
ఆదేశాలను అనుసరిస్తూ
పర్యవసన పరిణామాలెన్నో
ధనవంతుల నిరంకుశత్వానికి
నేలకొరిగిన ప్రాణాలెన్నో

అసమానతను చేదిస్తూ
కుటిల వ్యవస్థలను కూల్చేస్తూ
శ్రామిక నెత్తుటి సత్తువై
ఉద్యమ నినాదమై
ఎగిసిపడే చైతన్య కెరటమై

స్వేచ్ఛ ఊపిరిలు నింపుకొని
సమానత హక్కుగా
సమూహ శక్తిగా గళం విప్పి సంఘటితమై సాగాలి
నవ జీవనాన్ని కాంక్షిస్తూ
బానిస సంకెళ్ళు తెంచి
భరతమాతకు విముక్తి కలిగించు..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!