గెలిచిన మనసులు

(అంశం  “మానవత్వం”):

గెలిచిన మనసులు

రచన: దొడ్డపనేని శ్రీవిద్య

మానస్ బృందావనం లో ఓ మంచి పేరున్న డాక్టరు. మంచి మనషి కూడా. ఎవరితో గొడవలు పడే మనస్థత్యం కాదు. కష్టంలో ఉన్న మనిషికి సాయం చేయడం మానవత్వ లక్షణం అని నమ్ముతాడు మానస్. పేదవాళ్ళకి సహాయం చేయటం ఇష్టం. ఆ విషయంలో ఆసుపత్రి యాజమాన్యం తో మాటలు కూడా పడ్డాడు. నీకు అంతగా ఇష్టం అయితే సొంతంగా ఒక ఆసుపత్రి పెట్టి వైద్యం చేయి అంటారు. కానీ తనకి అంత స్తోమత లేదు అని తనకు తెలసు.

ఒక రోజు డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు వచ్చి బస్టాండు లో నిలబడ్డ మానస్ కళ్ళకి నిషిత అనే ఆమెతో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. మెల్లమెల్లగా ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. నిషిత ఒక టీచరు. మనిషి మంచిదే. కానీ మానస్ లా ప్రతి దానికి స్పందించే మనిషి కాదు. తన పరిధి లో తాను ఉండే మామూలు మనిషి. మానస్ కి కూడా ఎప్పుడూ ఇదే విషయం చెబుతుంటుంది. ఎందుకు సమస్యలని నెత్తినేసుకుంటారు . జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో మానస్ అంటుంది. మానస్ నవ్వి ఊరుకుంటాడు. పెళ్ళయితే భాధ్యత వస్తే మారతాడులే అనుకుని ఊరుకుంటుంది.
ఒక మంచి ముహుర్తం లో ఇద్దరికీ పెద్దల సమక్షంలో పెళ్ళి జరుగుతుంది. కాలక్రమం లో వారికి అందమైన బాబు కూడా. వారి జీవితం ఇలా గడుస్తున సమయంలో …

ఒక రోజు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన మానస్ కి ఏ వెహికల్ దొరకదు. సుమారుగా రాత్రి 11 దాటింది. అలసటగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా క్యాబ్ బుక్‌ చేస్తాడు. అలా బయలుదేరిన గంట తర్వాత నిర్మాష్యంగా ఉన్న దారిలో ఒక్కసారిగా మానస్ కి ఒక అరుపు వినిపిస్తుంది..డ్రైవర్ని (వంశ్రీ )కారు ఆపు అంటాడు. ఎందుకు సార్ సమస్య వెళ్ళిపోదాం అంటాడు. నీకు ఇష్టం లేకపోతే నన్ను దించి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అంటాడు మానస్ కొంచం అసహనంగా. వద్దులే సార్ చుద్దాం పదండి అంటూ ఇద్దరూ కారు దిగుతారు.

నిశీధి రాత్రి లో రోడ్డు పక్కన పొదల్లో ఒక అమ్మాయి అర్ధ వివస్త్రగా గాయాలతో పడి ఉంటుంది. అది చూసి డ్రైవర్ ( వంశీ) పోలీసులకి ఫోన్ చేద్దాం సార్. వాళ్ళే చూసుకుంటారు అని ఓ ఉచిత సలహా పడేస్థాడు.
వద్దు ఉండు, అసలు ఎవరో ఏంటో చూద్దాం ఏమయినా సమాచారం తెలస్తుంది అని అడుగు ముందుకు వేశాడు. ఆమె ప్రక్కన పడిఉన్న పర్సులో ఆమె పోటో, గుర్తింపు కార్డు ఉంటాయి. అందమైన ఆమె అమాయకత్వమైన మోము చూసి భాదేస్తుంది మానస్ కి. ఆమె పేరు కీర్తన అని తెలుసుకుంటాడు. డ్రైవర్ తో అదే విషయం చెప్పి కారులోకి ఎక్కించటానికి సహాయం చేయమని తన కోటు ఆమె భుజం చుట్టూ కప్పి లేపటానికి ప్రయత్నం చేస్తాడు. డ్రైవర్ ( వంశీ)కూడా మానస్ వినే పరిస్థితిలో లేడని గ్రహించి అయిష్టంగానే సాయం పడతాడు. ముందు ముందు ఏ సమస్య వస్తుందో అనుకుంటూ.

సార్ ఈమెని మీ ఇంటికి తీసుకుని వెళ్తారా లేక ఆసుపత్రికా అంటాడు. అదే ఆలోచిస్తున్నాను. ఆసుపత్రి అయితే ఈమె విషయం అంతా బయట పడి ఈమెని బ్రతిక నివ్వదు సమాజం. ఇంటికి వెళితే నా భార్య ఎలా స్పందిస్తుందో అర్థం కావటం లేదు అంటాడు. అలా ఆలోచిస్తుండగా , డ్రైవర్(వంశీ) మీకు అభ్యంతరం లేకపోతే నా రూముకి తీసుకు వెళదాము సార్ అంటాడు. సరే నీకు అభ్యంతరం లేకపోతే అదే సరైనది అనిపిస్తుంది అంటాడు.

ఆ రాత్రి ఆమె గాయాలకి మందు రాసి, మాత్ర వేసి ఇద్దరూ ఓ పక్కన విశ్రమిస్తారు.
మరుసటి ఉదయం వళ్ళంతా పచ్చి పుండులా అనిపించి భాధతో తల పట్టుకుని మూలుగుతుంది కీర్తన. ఆ శబ్దానికి నిద్ర లేచిన ఇద్దరూ, ఆమెకి దగ్గరగా వస్తారు. వాళ్ళని చూసి ఇంకా భయపడి పోతుంది. భయపడకు అని జరిగింది వివరించి ఆమె గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు.

అయితే కీర్తిన, నువు కొన్ని రోజులు ఇక్కడే ఉండు . నేను రోజూ వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను. రెస్ట్ తీసుకో. డ్రైవర్(వంశ్రీ) నీకు అభ్యంతరం లేదుగా అని అడుగుతాడు. సార్ ఆమె ఇబ్బంది చూడండి నాది కాదు అంటాడు.
ఆమె మౌనంగా ఉండి పోతుంది.
సరే అయితే నేను మందులు తెస్తాను అంటూ బయటికి నడుస్తాడు.

రాత్రి జరిగిన విషయం తెలుసుకున్న నిషిత ముందు భయపడుతుంది.
కానీ చేసేదేమీ లేక చెప్పినా మానస్ వినడని తెలిసి నిశ్శబ్దంగా ఉండిపోతుంది.
కాలం గడుస్తుంది.

ఒక రోజు, నిషిత కూడా మానస్ తో కీర్తన దగ్గరకు వస్తుంది. వంశీ, కీర్తన మంచి స్నేహితులు అవుతారు. ఆ ఇద్దరినీ చూసి, కీర్తన లేచి మానస్ కాళ్లకి నమస్కరిస్తుంది.
అయ్యో ఏంటిది కీర్తన అని వారిస్తు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నీ తప్పు లేకుండా జరిగిన ఓ ప్రమాదం కీర్తన ఇది. భవిష్యత్తు లో నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ఏమీ ఆలోచించకు అని ధైర్యం చెపుతాడు.
వంశీ అంటాడు.. సార్ కీర్తనకి అఖ్యంతరం లేకపోతే నేను ఆమెని వివాహం చేసుకుంటాను అంటాడు. కీర్తన అతని సంస్కారానికి అచ్చెరువై కళ్ళప్పగించి అలా చూస్తుండిపోతుంది.

నిషిత గారు మీరు చాలా అదృష్టవంతులు ఇంత మంచి ,మానవత్వం ఉన్న మనిషి మీకు దక్కినందుకు అని అంటుంది కీర్తన. నేనే కాదు కీర్తన నిన్ను ఈ పరిస్థితుల్లో స్వీకరిస్తున్న వంశీ లాంటి మంచి మనిషి దొరికిన నువ్వు కూడా అదృష్టవంతురాలివే అని తిరిగి బదులిస్తుంది నవ్వుతూ….

నిషిత, కీర్తన మానవత్వం మూర్తీభవించిన ఆ ఇద్దరినీ తన్మయత్వంతో వారి మనసులు గెలుచుకున్న ఆనందంలో అలా కళ్ళార్పకుండా చూస్తుండి పోయారు.

ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టే ఇంకా మనం సుఖంగా ఉండ గలగుతున్నాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!