కాలం మనిషి మానవత్వం

(అంశం : “మానవత్వం”)

కాలం మనిషి మానవత్వం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

రామపురంలో రాజయ్య రమణమ్మ అనే ఇద్దరు దంపతులు వున్నారు.వారు కాయకష్టం తో బతుకుతున్నారు.ఇద్దరే కదా అని రామయ్య రమనమ్మను పనికి పంపకుండా ఇంటిదగ్గరే ఇంటి పని చూసుకో అని అపురూపం గా భార్యను చూసుకుంటున్నాడు.తాను మాత్రం కలాసీ పని చేసుకుంటూ వచ్చిన దానితో హాయిగా కాలం గడుపుతున్నారు.అందరికి తనకున్న దానిలో లేదనక కాదనకా సాయం అందిస్తూ అందరి నోటా మంచి దంపతులుగా పేరు తెచ్చుకొని బతుకుతున్నారు.కానీ వాళ్ళకి పెళ్లై చాలా రోజులు అయినా సంతానం లేక కొంచెం దిగులు చెందుతున్నారు.ఎన్నో దేవుళ్ళకు సంతానం కోసం మొక్కుతున్నారు
ఏ దేవుడు కరుణించాడో రమణమ్మ నెల తప్పింది.రాజయ్య ఆనందానికి అవధులు లేవు.9నెలలు బాగా కాలు కింద పెట్టకుండా రమనమ్మను కంటికి రెప్పలా చూసుకున్నాడు రాజయ్య.ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఇక ఆ దంపతులకు ఆ బిడ్డే సర్వస్వం గా బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ల లాగే తన బిడ్డ కాకూడదని పేద బతుకు వద్దని ఎలాగైనా మంచి చదువు చదివించి కలెక్టర్ చేద్దామని అనుకున్నారు
ఇక ఇద్దరూ కష్టపడటం ప్రారంభించారు.బాబు బంగారు భవితకు బాట వేయాలని ముందడుగు వేశారు.ఒక కార్పొరేట్ పాఠశాలలో తాహతకీ మించి జాయిన్ చేశారు. తదుపరి కార్పొరేట్ కళాశాలలో చదివించారు.బాబుకి పేదరికం తెలియకుండా పట్టణం లో హాస్టల్ లో ఉంచి వారి రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసి వారు తిన్నా తినకపోయిన అధిక ఫీజులు కట్టి బిడ్డను ఉన్నత చదువులు చదివించారు.చుట్టుపక్కల వాళ్ళు ఎంతో హర్షించారు.అన్నింట్లో వాళ్ళు అనుకున్నట్లే ఫస్ట్ రాంక్స్ తో ముందడుగు వేసాడు.
ఈలోగా రమణమ్మ ఆరోగ్యం క్షీణించింది.కానీ పట్టువదలని విక్రమార్కుడి లా ఆ దంపతులు పట్టుదలతో ఆ బిడ్డను కలెక్టర్ చేశారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.ఇరుగుపొరుగు వారు మంచి వాళ్ళకీ మంచి జరుగుతుందని రాజయ్య దంపతులను పొగిడారు.ఇక రాజయ్య భార్య ఆరోగ్యం కోసం పట్టించుకోని బిడ్డ దగ్గరకు వెళ్ళాడు.కానీ షరా మామూలే .రాజయ్య బిడ్డ రాజయ్యకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు.అయినా రాజయ్య సరే అని సర్దుకొని రమణమ్మ విషయం చెప్పాడు.కానీ బిడ్డ డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నాడు. రాజయ్య కళ్ళు మండసూర్యుని తలపించాయి.
వాదనకు దిగాడు.కానీ కన్నకొడుకు తండ్రినే తండ్రి కాదని కాళ్లతో తన్ని పంపించాడు.
విషాద వదనం తో ఇంటి దారిపట్టాడు రాజయ్య. విషయం ఇంటిదగ్గర చెప్పలేదు.వారం రోజులు పోయాక పెద్దాసుపత్రి లో జాయిన్ చేద్దామని చెప్పాడు.ఈ లోగా డబ్బు యేవలో పడ్డాడు రాజయ్య.కానీ కాలం రాజయ్యను చిన్నచూపు చూసింది.భార్య మరణించింది.రాజయ్య ఒంటరివాడయ్యాడు.చుట్టుపక్కల వాళ్ళు రాజయ్యను చూసి జాలి పడ్డారు.అంతకు మించి ఎవరేమి చేయగలరు.ఇది కాలప్రభావమని కాల మహిమని అనుకున్నారు.కలికాలమా నువ్వు ఇంత కాఠిన్యమా.మానవత్వాన్ని మరిచి సొంత బిడ్డలే వద్దన్న సమాజం ఏర్పడుతుంది.మానవతా విలువలు మరుగున పడుతున్నాయి కన్నీటి వ్యధలు బయలు పడుతున్నాయి.మానవత్వం సిగ్గుపడుతుంది. తెరుకో ఓ మనిషి నిన్ను నువ్వు చూసుకోవడం నేర్చుకో

తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ భేరం అని చిన్నాయసూరి చెప్పిన నీతి కథను గుర్తుంచుకో ముందడుగు వేయు.కాలం మనిషి మానవత్వం వీటిని తెలుసుకో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!