నేనింతే

నేనింతే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

నేనింతే అనే వానికి చివరకు చింతే
మూర్ఖూల వాదన నేనింతే మూడుల భావన నేనింతే
త్రాష్టుల మాట నేనింతే
చేతకాని వాని మాట నేనింతే
చైతన్యం లేని వాని మాట నేనింతే
సాధన తెలియని వారి మాట నేనింతే
లక్ష్యం లేనివారి మాట నేనింతే
బంధాలు అనుబంధాలు కరువై
భవబంధాలు దూరమై
మమతానురాగ బంధాలు బరువై
ఏకాకి గా వున్న వాళ్ళు అనే మాట నేనింతే
అధికారదర్పం
కన్ను మిన్ను కానరాని తత్వం
నరమంత్రపు సిరి గలిగిన వారు
విలువలు తెలియని వారు వాడే మాట నేనింతే
నేనింతే అనే రావణుడు ఏమయ్యాడు
నేనింతే అనే దుర్యోధనుడు ఏమయ్యాడు
నేనింతే అనే కంసుడు ఏమయ్యాడు
మనిషిని కనుమరుగు చేసే పదం “నేనింతే”
అందుకే “నేనింతే” పదానికి చెబుదాం ధన్యవాదాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!