బోరు మోటారు దగ్గర ప్రేమ వ్యవహారం

(అంశం:: “నా ప్రేమ కథ”)

బోరు మోటారు దగ్గర ప్రేమ వ్యవహారం 

రచన: రాజెల్లీ సాయికృష్ణ

చదువు అంతా అయిపోయిన తర్వాత ఎవడి చేతికింద పనిచేయొద్దని నిర్ణయించుకొని మా సొంత ఊర్లోనే కిరణం షాపు పెట్టుకున్నా

🌞సూర్యోదయం వేళ అది 🌞
కూరగాయల బండి వచ్చి నా షాప్ ముందు ఆగింది కూరగాయలు తీసుకోవడానికి ఒక అందమైన 👩‍🦱అమ్మాయి👩‍🦱 వచ్చింది
ఆమెని చూస్తూ అలాగే ఉండిపోయా

మబ్బుతో ఉన్న నా మొఖం ఆమెను చూడగానే వేలిగిపోయింది

ఆ అందాన్ని వర్ణించడానికి ఈ రాతలు సరిపోవేమో , అంత అందంగా ఉంది ఆమె
చందమామ కంటే అందంగా ఎవరైన వుంటారా!అంత అందంగా ఉంది ఆ పిల్ల

పాలతో తయారు చేసిన ఆ మొఖం

గాజుతో తయారు చేసిన ఆ కళ్ళు

ఉరులు తేప్పించే ఆ కురులు

ఆ దేవుడు ఆమెను
ఏ లోపం లేకుండా ఇంకో దేవకన్య ను సృష్టించాడేమో అని అనిపించింది

పిచ్చివాడిలా ఆమెని చూస్తూ అలాగే ఉండిపోయా

నా షాపులో ఆమెకు ఏం అవసరం ఉన్నా వేరే వేరే వాళ్ళతో డబ్బులు ఇచ్చి పంపించేది

ఒకరోజు ఎవరూ లేకపోయేసరికి ఆమెనే నా షాప్ దగ్గరికి రావాల్సి వచ్చింది

ఆమె నా షాప్ కి రాగానే తీవ్ర ఆందోళనకు గురై ఆగమాగం చేస్తున్న

ఆమెకు ఏం కావాలో తెలుసుకోకుండా ఆమెని అంత దగ్గరలో చూసిన భయానికి నా షర్ట్ ప్యాంట్ ను సదురుకుంటున్న

ఆమె కోపంగా ఇస్తావా! లేదా వేరే షాప్ కి వెళ్లాలా అని గట్టిగా అన్నది

నేను సారీ అండి మిమ్మల్ని చూస్తే కాళ్లు చేతులు వణుకుతున్నాయి అని అన్నాను
నేనేం దయ్యంలా కనబడుతున్నానా! అని అన్నది ఆమె

దయ్యంలా కాదండీ దేవతలా కనబడుతున్నారు
ఆ దేవుడే కరుణించి నువ్వు నా షాప్ కు వచ్చేలా చేసాడేమో అని అన్నాను ఆమెతో

హుం
అనుకుంటూ వెళ్ళిపోయింది

ఆ రోజు నుండి బతుకమ్మ పండుగ వరకు మాట్లాడటం కుదరలేదు

బతుకమ్మ పండుగ రోజున నా షాపును బంద్ పెట్టేసి అమ్మాయి కోసం బతుకమ్మలు ఆడే దగ్గరికి వెళ్లి
మా ఫ్రెండ్స్ దగ్గర నిలుచున్నా,

అక్కడ ఎంత మంది అమ్మాయిలు ఉన్న నా కంటికి మాత్రం నా ప్రియురాలు మాత్రమే కనబడుతుంది

బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ ఏంటి నన్నే చూస్తున్నావ్ అన్నట్టు కనుసైగ చేసింది ఆ పిల్ల
ఏం లేదు అని తల ఊపాను
కొద్దిసేపు మా మధ్య మూగ సైగలు జరిగాయి

మా బతుకమ్మ ని ఎత్తుకొని ముందు నేను నడుస్తున్న
నా వెంట ఆమె నడుస్తుంది

ఆమె నా వెంట అలా నడుస్తూ ఉంటే
నా ఊహలు ఆకాశానికి అందాయి పెళ్లిలో 7 అడుగులు వేసినట్టు ఊహల లోకంలో మునిగిపోయా
ఆ రోజు అలా సంబరంగా గడిచిపోయింది

నేను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పలేకపోయాను

కొన్ని రోజులకి నా శాపు ముందు ఉన్న బోరు మోటర్ దగ్గరకు బట్టలు ఉతకడానికి వచ్చింది
ఆ పిల్ల

నేను ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను

ఆమె దగ్గరకు వెళ్ళే కొద్దీ భయం భయంగా ఉంది

గుండె వేగం పెరిగిపోతోంది

కాళ్లు చేతులు వణుకుతున్నాయి

ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి

ఎలాగో అలా ఆమె దగ్గరికి వెళ్ళనే వెళ్లాను

నీతో ఒక విషయం చెప్పాలి నువ్వేమీ అనుకోవు కదా అని అన్నాను

పర్వాలేదు చెప్పు నేనేం అనుకోను అన్నది ఆమె

ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక పోయాను
ఆమెతో మాట్లాడే రెండు మూడు మాటలే గాని తడబడుతున్నాయి

ఆమెతో ఏం చెప్పలేక తిరిగి వచ్చేసాను

ఆమెకు చూడని రోజు గడవదు

ఆమెను తలవకుండా ఉండలేను

నా మనసులో మాట చెప్పడానికి ఒక ప్రేమ లేఖ రాసి ఉంచా!

ఆ ప్రేమలేఖ ని తీసుకొని ప్రతిరోజు వెళ్తున్నా కానీ ఆమెకు ఇవ్వలేక పోతున్నా

ఇందులో ఉన్న ప్రతి అక్షరం నా మనసు చెప్పిన మాటలే

( ప్రేమ లేఖ)

💛నీ చురకత్తుల వంటి కన్నులని చూస్తుంటే నేను మాట్లాడే మాటలు తడబడుతున్నాయే💛
✍️అందుకే నా గుండె లోని భావం రాత రూపంలో రాశి చెప్తున్నా✍️

షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్ మహల్ ని నిర్మింఛాడంటే
డబ్బులు ఎక్కువై నిర్మించాడెమో అనుకున్నా!

ప్రేమ ఎక్కువై నిర్మించాడని
నేను నిన్ను ప్రేమించాకే తెలుసుకున్నా,,

నీకోసం తాజ్ మహల్ ని కట్టలేనేమో కానీ
💘ని గురించి మాత్రమే ఆలోచించే గుండెను మాత్రం కోసి ఇవ్వగలను💘

ఆనాటి రాణి పద్మావతి ని పెళ్లి చేసుకోవడానికి రాజులు రారాజులు యుద్దాలు చేసి ఒకరినొకరు చంపుకున్నారట!
ఇప్పుడు నాకర్థమవుతుంది,
ని కోసం ఎన్ని యుద్దలైనా చేస్తానని

🖤దూరంగా వెళ్లిపోకే ఓరువలెనే ఏ దూరాన్ని🖤

💓విశాలమైన హృదయం నాది ఆ హృదయం లో చోటు లేకుండా నిండి పోయావే💓

💛తలపు సందులోంచి తొంగి చూసి నేను తొందరపడేలా చెయ్యమాకే💛

💜ని చూపులే నేను నిన్ను ప్రేమించేలా చేస్తున్నాయి💜

💞నా మనసు చెపుతుంది నిన్ను అస్సలు వదులుకోవద్దని💞

నువ్వు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా!

నిజంగా నిజాయితీగా ప్రేమిస్తున్నా!

ఇట్లు
నీ ప్రేమబానిస
Saikrishna

నా కథకి క్లైమాక్స్ లేదు ఎందుకంటే నా ప్రేమ ఇంకా కొనసాగుతూనే ఉంది ..

You May Also Like

2 thoughts on “బోరు మోటారు దగ్గర ప్రేమ వ్యవహారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!