అమ్మ

అమ్మ

రచన: మట్టపర్తి నాగ రమేష్

అమ్మ…
మన ఆది “గురువు”
మన పాలిట ” కల్పతరువు”
రానీయదు మనకెన్నటికీ “కరువు”
కాపాడుతుంది సదా మన “పరువు”
వేస్తుంది మన క్రమశిక్షణకై “దరువు”
తన శిక్షణే మన మేధస్సుకు “ఎరువు”
మనకై తన ఆత్మాభిమానాన్ని పెడుతుంది “అరువు”
చూపిస్తుంది మనకో మంచి “బ్రతుకుతెరువు”
అలాంటి దేవత వృద్ధాప్యంలో కాకూడదు… మనకు “బరువు”
అమ్మంటే ” ఆప్యాయత ”
అమ్మంటే ” అనురాగం ”
అమ్మంటే ” అభిమానం ”
అమ్మంటే ” ఆనందం ”
అమ్మంటే ” ఆశీర్వాదం ”
అమ్మంటే ” అదృష్టం “

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!