భారమైన బాల్యం

భారమైన బాల్యం

బండి చందు

బాల్యమా ఏమైపోయావ్
ఓ! బందీ అయిపోయావా
అసలు ఎక్కడ ఉన్నావ్
గతంలోన గాయాలలోన
గతించని జ్ఞాపకాలలోన
అంత సమయం నీకెక్కడిది
ఎప్పుడో నా చిన్నతనంలో
నిన్ను చూసినట్టు గుర్తు
మళ్ళీ ఇప్పుడు కాకపోతే
ఓ బాలుడి చేతిలో
మునివేళ్ళు తాకే చరవాణిలో
అదిగో అక్కడ ఆ క్షణం
నా బాల్యం బందీయై విలపిస్తున్నది
కనురెప్ప ఎత్తలేని చూపులో
తలా తిప్పి చూడని స్థితిలో
పలకరించని పసి గొంతులో
నేనేం చెప్పినా వినిపించుకోక
నన్ను ఒక పిచ్చివాడిలా చూసిన
ఆ క్షణమే అనిపించింది
నేటి బాల్యం భారమైపోయిందని…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!