ప్రకృతి సోయగం

ప్రకృతి సోయగం

దొడ్డపనేని శ్రీవిద్య

కారు మబ్బులు కమ్ముకొనగా
చల్లటి వాన చినుకులు కురియగా
నేల తల్లి ఒళ్ళు విరిచి పరవశించగా

వాగు వంకలు పరవళ్ళు త్రొక్కగా
పచ్చని పైర్లు ఉయ్యాల లూగగా
కోయిల వసంతరాగం ఆలపించగా

అలసిన మనసు సేద తీరగా
పారేటి సెలయేరులు జాలు వారగా
నాట్యమయూరం పురివిప్పి కనువిందు చేయగా

సుగంధ పరిమళ పుష్పాలు విప్పారగా
ప్రకృతి తన్మయత్వం తో ఉర్రూతలూగగా
నయనానందకరంగా రమణీయ చిత్రాలు చిలికించిన వేళ

స్వర్గ దారులు తెరిచినట్లు అగుపించగా
పుడమి తల్లి పరవశించి కవి హృదయాలు సైతం మాటలు కందని మైమరుపుతో….

కమనీయ హాయి గొల్పు చిత్రకారుడు చిత్రించిన అందాలతో…
ఎన్నో వసంతాల నిరీక్షణ ఫలితం…
అముల్యమైన అద్భుత దివ్య కాంతుల ప్రకృతి సోయగం కనువిందు చేస్తుంటే చూడ చక్కని ధరణి అందాలకు
తుది శ్వాస వరకూ బానిసలమే కదా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!