గురు పరంపరం

గురు పరంపరం

రచన: లోడె రాములు

యుగ యుగాలుగా వర్ధిల్లుతుంది భారతీయ గురు పరంపరం..
బుద్ది వికసించి దేవుడయ్యాడు… ఆచార్య దేవోభవః వేద వాక్యం..
ప్రసిద్ధ గురువుల వ్యక్తిత్వ వికాస లక్షణాలు మనకు ఆదర్శం ..
సర్వజనహిత,సద్గుణాలతో జీవితమెలా వికసించాలో చెప్పిన వశిష్టుడు..
సంచార విద్యా,ఆశ్రమ,ప్రదేశాల
వృత్తాంతాన్ని తెల్పిన విశ్వామిత్రుడు..
తన కర్తవ్యాన్ని తాను చేస్తూనే ఉత్తమ విద్యలు బోదించే కర్మసాక్షి,
గ్రహాధిపతి సూర్య భగవానుడు..
ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అందించిన ఆదిగురువు వాల్మీకి..
గురుశిష్య అనుబంధానికి పరిపూర్ణ
ఉదాహరణ ఉదంకోపాఖ్యానం..
కచ దేవయానుల చరిత్ర ఉపాధ్యాయులకే కాదు లోకానికీ గుణ పాఠాలే..
భిన్న వర్గాలకు క్రమశిక్షణతో విద్య నేర్పిన నైపుణ్యం ద్రోణాచార్యులదే
వృద్ధ,యువ తరానికి యుద్ధ విద్యలు నేర్పిన విలక్షణ గురువు పరశురాముడు..
గురుత్వాన్ని,గురు తత్వాన్ని బోధించే వామన చరిత్ర..
విద్యార్థుల వ్యక్తిత్వాన్ని వికసింపజేసిన సాందీపని…
మానవులెవరైనా గురు సన్నిధిలో
గురు ప్రభోదితులై తీరాలి..
గురువు లందరిని గౌరవిద్దాం..
వారి ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిద్దాం..
ఓం గురుబ్యోనమః….
*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!