అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

రచన: శ్రీదేవి విన్నకోట

అమ్మ అన్న పిలుపు అమృతమయం.
అమ్మ తీయని పలుకులు
మన ఆనందాలకి నెలవు.
అమ్మనవ్వు వర్షించే శ్రావణ సమీరం.
అమ్మ మనసు చల్లని
వెన్నెల మయం.
అమ్మ ఉన్న గృహం
స్వర్గానికి రహదారి.
అమ్మ బలమైన శక్తి స్వరూపిణి.
అమ్మ పిల్లల శ్రేయస్సుకై  శ్రమించే  శ్రేయోభిలాషి.
అమ్మతనం త్యాగానికి ప్రతీక.
అమ్మ తన ఇంటి కోసం బాధ్యతగా తననీ తానుగా అర్పించుకున్న సేవిక.
అమ్మ పిల్లల కోసం కరిగిపోయే వెలుగు దీపిక.
అమ్మ పిల్లలకై చేసే త్యాగం  ఆకాశంలో శరచ్చంద్రిక
అమ్మ  అనురాగ వల్లిక
అమ్మలేని ఇల్లు నరకానికి నిచ్చెన
అమ్మ మన వెంట ఉంటే సంతోషాల మయం
అమ్మ పేరే మన పెదవులు పలికే తొలిపలుకు.
అమ్మ రూపే మన కళ్ళలో ముద్రించే తొలి రూపు.
అమ్మ పాటే మన
తొలి మేలుకొలుపు.
అమ్మే మన అందరికీ మార్గదర్శిని
మన  ఆనందాలను ప్రాణంగా ప్రేమించే అమ్మ కంటి వెలుగులే కదా పిల్లలు.
అమ్మ అందుకే మా జీవితంలో ఒక భాగం,అమ్మే జీవిత సర్వస్వం.మరో జన్మ కి
కూడా మా అమ్మకే బిడ్డగా
పుట్టి రుణం తీర్చుకోవాలని
నా కోరిక

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!