ప్రయత్నం

ప్రయత్నం

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ప్రయత్నమే విజయాన్నందిస్తుంది
శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ భానిసవుతుంది
సాధ్యాసాధ్యాలు ప్రయత్నమే నిర్ణయిస్తుంది
ఇదే సాధనాత్ సాధ్యతే సర్వం తెలియజేస్తుంది

గంగను భూమిపైకి తీసుకొని రావడానికి భగీరథుడు
వారధి నిర్మించడానికి హనుమంతుడు
భర్తప్రాణాలు కాపాడుకోవడానికి సావిత్రి
ఇలా ప్రయత్నాలు తో సఫలం అయినదే చరిత్ర

కృషితో నాస్తి దుర్భిక్షం
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
కృషి ఉంటే అజ్ఞానం విజ్ఞానం అవుతుంది
కృషి ఉంటే సామాన్యుడు అసామాన్యుడవుతాడు

ఎన్నో వేల ప్రయత్నాల ఫలితమే ఎడిసన్ బల్బ్ సృష్టి
ముసలివయసు లో కూడా కృషియే కె .ఎఫ్. సి సృష్టి
ఎన్నో ఏళ్ల పోరాట ప్రయత్నమే మన ఈ స్వతంత్ర ఫలం
ఎన్నో ఏళ్ల నిరంతర సాధనయే ఈ ఆధునికత

అందుకే మనిషి ఎదగాలన్న
అనుకున్నది సాధించాలన్న
అభ్యున్నతి పొందాలన్నా
అవకాశాలను సృష్టించుకొని ప్రయత్నం చేస్తే విజయమే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!