సుబ్బారావు ప్రేమలేఖ
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
సుందరికి సుబ్బారావు రాయునది
నువ్వంటే నాకు పిచ్చి
నీ నవ్వంటే మరీ పిచ్చి
నీ కాకిస్వరం వినాలంటే మరీ మరీ పిచ్చి
నీ బూరెల్లాంటి బుగ్గలను నిమరాలని
నీ సకినాల్లాంటి కళ్ళలోకి చూడాలని
నీ కొబ్బరిపీచు జుట్టును తాకాలని
ఎంతగానో తపిస్తున్నా..
నీ ప్రేమను పొందాలంటే ఏమి చెయ్యను చెప్పు
మీ ఇంటి మురికి కాలువలో గెంతమంటావా
మీ ఇంటి పెరటిలోని నీళ్ళులేని బావిలో దూకెయ్యనా
ఊరి చివర చెరువులోని బురద నీటితో స్నానం చెయ్యనా
ఏం చెయ్యను??
నీ ప్రేమకోసం పరితపిస్తున్నా
నీకోసం కాలేజిగేటు దగ్గర ఐస్క్రిము అమ్మనా
నువ్వు వెళ్ళే గుడి దగ్గర పూజద్రవ్యాల కొట్టు పెట్టనా
ఏం చెయ్యను??
నీప్రేమ ఏలా పొందను!!