ఇంకెన్నాళ్లు

(అంశం:”బానిససంకెళ్లు”)

ఇంకెన్నాళ్లు

రచన: జయ

భారతావని బానిస సంకెళ్ళు తెంచుకొని.
స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది
పరాయి దేశ పాలన నుండి.

మరి ఆ భారతవనిలో వనిత
నీకెప్పుడమ్మా
ఈ మృగాల నీచపు చూపుల నుంచి విముక్తి.

ఆ నాటి సీత నుంచి
ఈ నాటి పసిపాప వరకు ఏక్కడమ్మా నీ స్వేచ్ఛ

సూర్యోదయంలో విచ్చుకున్న పుష్పం లా
సంధ్యాసమయంలో అరవిరిచిన వెన్నెల లా
ఉండవలిసిన నీ మోమును చిరునవ్వును
చిదిమేసిన పాపం ఎవరిది?

పసిప్రాయంలోనే ఆడ పిల్ల అనే ముద్రవేసి
ఇంటికే పరిమితం చేసిన తల్లితండ్రులదా.
ఆడపిల్ల కి అలాంటి దుస్థితి తీసుకువస్తున్న
మగమహారాజులదా కాదు కామ పిశాచులదా.

ఏమున్నది ఆడ దాని శరీరం లో
మరో ప్రాణికి తన రక్తమాంసాలు ధారపోసి
ప్రాణం పనం గా పెట్టి సృష్టిలోకి తీలుకువచ్చే
గర్భకోశమే గా, పాలు పట్టి ఓదార్చిన చనుబాలే గా
మీ కామం తీర్చే ఆ తనువులో ఉండేవి.
తల్లి ని చెల్లి ని కూడా వదలని
ఓ మృగా రాజా నువ్వు ఉన్నది.
అడవిలో కాదు మానవ సమాజంలో
అని గుర్తుపెట్టుకో.

పుట్టింట ఓ యువరాణి.
మెట్టినింట తాళి అనే సంకెళ్ళు వేసి.
మగువ మనస్సున ఉన్న ఆశయాలకు,ఆశలకు
వేసినవి బానిససంకెళ్లు కాదా

మరి ఎక్కడ ఉంది స్వేచ్ఛ ,స్వాతంత్ర్యం
ఎప్పుడు ఇస్తారు మాకు
ఈ బానిస సంకెళ్ళు నుండి విముక్తి.
చెప్పమ్మా భారత మాత.
ఎందరో దేశం గర్వించదగ్గ
స్త్రీ మూర్తులు నడయాడిన
నేటి భారత వనిత కు స్వేచ్ఛగా
తన ఉనికి ని చాటే రోజు ఎప్పుడు వస్తుందో
చెప్పమ్మా భారత మాత.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!